NEET UG 2026 Cancellation: 22లక్షల మందికి షాక్-ఆందోళనలు-రంగంలోకి సీబీఐ..!

ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష (NEET UG 2026 ) రద్దు కావడం 22 లక్షల మంది విద్యార్ధుల్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. పరీక్షకు ముందే రాజస్థాన్ లో గెస్ పేపర్ పేరుతో లీక్ కావడం, దీన్ని 20 లక్షల నుంచి 2 కోట్ల వరకూ రేటుకు అమ్ముకోవడం జరిగిపోయాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం పోలీసులతో దర్యాప్తు చేయిస్తోంది. ఇందులో నీట్ పేపర్ లీక్ నిజమేనని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నీట్ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి కొత్త తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

NEET 2026 Analysis: నీట్ పరీక్ష ఎలా ఉంది, సబ్జెక్ట్ ల వారీగా -కటాఫ్ అంచనా ?
NEET 2026 Analysis: నీట్ పరీక్ష ఎలా ఉంది, సబ్జెక్ట్ ల వారీగా -కటాఫ్ అంచనా ?

దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఢిల్లీలో పలు విద్యార్ధి సంఘాల నేతలు ఎన్టీయే తీరుకు నిరసనగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గతంలోనూ నీట్ పరీక్ష లీక్ అయినా సుప్రీంకోర్టు దాని ఫలితాల్ని కొనసాగించడంతో ఇప్పుడు మరోసారి లీక్ అయిందని విద్యార్ధి నేతలు ఆరోపిస్తున్నారు. లీక్ కు కారకుల్ని తక్షణం శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజస్తాన్ లో లీక్ బయటపడినా ఇంత ఆలస్యంగా పరీక్ష రద్దు చేయడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

NEET UG 2026 Cancelled Paper Leak Triggers Nationwide Protests CBI Takes Over
NEET 2026 : నీట్ పేపర్ లీక్ ? రాజస్థాన్ లో 20 వేల నుంచి 2 లక్షలకు ?
NEET 2026 : నీట్ పేపర్ లీక్ ? రాజస్థాన్ లో 20 వేల నుంచి 2 లక్షలకు ?

మరోవైపు నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన అన్ని రికార్డులు, సహాయాన్ని అందిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులకు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలుగుతుందని ఎన్‌టీఏ అంగీకరించింది. అయితే, జాతీయ పరీక్షా వ్యవస్థతో ముడిపడి ఉన్న సమగ్రతను, విశ్వసనీయతను కాపాడటానికి ఈ నిర్ణయం అవసరమని ఎన్టీఏ స్పష్టం చేసింది. మే 2026 సీజన్ కోసం అభ్యర్థులు నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ డేటా, అభ్యర్థి వివరాలు, పరీక్షా కేంద్రాలు తిరిగి నిర్వహించే పరీక్షకు కూడా వర్తిస్తాయని ఎన్‌టీఏ తెలిపింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయనవసరం లేదని, అదనపు పరీక్షా రుసుము వసూలు చేయబోమని తెలిపింది. అభ్యర్థులు ఇప్పటికే చెల్లించిన రుసుములను తిరిగి చెల్లిస్తామని, తిరిగి పరీక్షను తమ అంతర్గత వనరులను ఉపయోగించి నిర్వహిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+