ట్రంప్ ఆరోగ్యం క్షీణస్తుందా? మే 26న ఏం జరగబోతుంది?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్య పరిస్థితి తెలుకోవడానికి మెడికల్ చెకప్స్ కు సిద్ధమయ్యారు. మే 26న మేరీల్యాండ్‌లోని ప్రఖ్యాత 'వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్'కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోబోతున్నారు. 80 ఏళ్లకు చేరువలో ఉన్న ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా నిశిత పరిశీలన జరుగుతున్న తరుణంలో, వైట్‌హౌస్ ప్రకటించిన ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైట్‌హౌస్ సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ పర్యటన అధ్యక్షుడి సాధారణ నివారణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా జరుగుతుంది. వార్షిక వైద్య పరీక్షలు, దంత పరీక్షల అనంతరం చేయించుకుంటారు. అనంతరం ట్రంప్ వాల్టర్ రీడ్‌లో చికిత్స పొందుతున్న సైనిక దళాలలోని పురుషులను, మహిళలను కలుసుకుంటారు. దేశం కోసం వారు చేస్తున్న సేవ, అంకితభావానికి గుర్తింపుగా అక్కడి సైనిక సిబ్బంది , ఉద్యోగులతో ట్రంప్ సమయం గడపనున్నారు.

గత ఏడాది 'సిరల' సమస్య.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
గత ఏడాది జూలైలో 79 ఏళ్ల వయసులో ట్రంప్ కాళ్లలో స్వల్ప వాపు కనిపించడం చర్చనీయాంశమైంది. అప్పట్లో నిర్వహించిన సమగ్ర పరీక్షల్లో ఆయనకు "క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ" (Chronic Venous Insufficiency) అనే నిరపాయకరమైన సిరల సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ట్రంప్ "అద్భుతమైన" ఆరోగ్యంతో ఉన్నారని గతంలోనే ధృవీకరించారు. అదనపు జాగ్రత్తలో భాగంగానే ఈసారి కూడా సాధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.
అధ్యక్షుల వైద్య నిలయం: వాల్టర్ రీడ్
అమెరికా అధ్యక్షులకు వైద్య సేవలు అందించడంలో వాల్టర్ రీడ్ సెంటర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. 2011లో వాల్టర్ రీడ్ ఆర్మీ మెడికల్ సెంటర్ , నేషనల్ నావల్ మెడికల్ సెంటర్‌ల విలీనం ద్వారా ఈ ఏకీకృత కేంద్రం ఏర్పడింది. 1909లో స్థాపించిన ఈ కేంద్రం ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం యుద్ధాల సమయంలో అమెరికా సైనికులకు అండగా నిలిచింది. ప్రస్తుతం ఇది యునైటెడ్ స్టేట్స్‌లో సైనిక ఆరోగ్య సంరక్షణకు అతిపెద్ద , ఏకీకృత కేంద్రంగా సేవలు అందిస్తోంది. అధ్యక్షుడి పరీక్షల ఫలితాలకు సంబంధించిన అదనపు వివరాలను వైట్‌హౌస్ త్వరలోనే వెల్లడించనుంది.














Click it and Unblock the Notifications