వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

,సుప్రీం జడ్జిలు లేవనెత్తిన అంశాలు ఆవేదన కల్గించాయి: రాహుల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నలుగురు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై స్పందించిన తీరు తీవ్ర ఆవేదన కల్గించాయని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడించిన అంశాలు తనకు తీవ్ర ఆవేదనను కల్గించాయని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై తిరుగుబాటు చేస్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహించిన వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. న్యాయమూర్తులు వెల్లడించిన అంశాలు తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని, ఈ విషయంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని పేర్కొంది.

సుప్రీం జడ్జిల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు: కాంగ్రెస్సుప్రీం జడ్జిల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు: కాంగ్రెస్

న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం మునుపెన్నడూ లేని అసాధారణ చర్య అని, జడ్జీలు లేవనెత్తిన అంశాలను సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రభుత్వానికి సూచించారు. సోహ్రాబుద్దీన్‌ కేసును విచారిస్తున్న సీబీఐ జడ్జి లోయ అనుమానాస్పద మృతి కేసును సరిగ్గా విచారించాల్సిన అవసరముందన్నారు.

 Questions Supreme Court Judges Raised Need To Be Looked Into, Says Rahul Gandhi

ఈ కేసులో స్వతంత్ర విచారణ జరగాలని అన్నారు. దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని, వారందరూ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌లు ఉమ్మడిగా బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని నెలలుగా కేసుల కేటాయింపులు, పరిపాలనా విధానం గాడితప్పాయని, జరగకూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని జడ్జిల బృందం విమర్శించింది.

English summary
As the government responded to the allegations of four Supreme Court judges with a studied silence, Congress president Rahul Gandhi called the points raised by the judges "extremely important" that "must be looked into carefully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X