బీఎండబ్ల్యూ కారులో మంటలు: రేసర్ అశ్విన్ సుందర్ దంపతుల సజీవ దహనం
భారత ప్రొఫెషనల్ రేసర్ అశ్విన్ సుందర్ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అశ్విన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కార్లను, చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆశ్విన్ సుందర్, భార్య నివేదిత సజీవ దహనమయ్యార
చెన్నై: భారత ప్రొఫెషనల్ రేసర్ అశ్విన్ సుందర్ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అశ్విన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కార్లను, చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆశ్విన్ సుందర్, భార్య నివేదిత సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అశ్విన్ 2012, 2013లో ఎల్జీబీ ఎఫ్4 కేటగిరీల్లో విజేతగా నిలిచారు.

చెట్టును బలంగా ఢీకొనడంతో..
రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారులో మంటలు చెలరేగి రేసర్ అశ్విన్ దంపతులు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని శాంతం హైరోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.

తెరచుకోని కారు డోర్లు..
కారు చెట్టును ఢీకొట్టిన తర్వాత వాహనంలోంచి బయటకు వచ్చేందుకు సుందర్ దంపతులు ప్రయత్నించారని, కానీ, కారు డోర్లు తెరచుకోలేదని, ఇంతలోనే కారులో మంటలు చెలరేగాయని ఘటనా స్థలంలో ఉన్నవారు చెప్పారు.

అశ్విన్ సుందరే కారు నడిపారు..
ప్రమాద సమయంలో సుందర్ కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనలో చనిపోయిన ఆయన భార్య నివేదిత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు.

క్షణాల్లోనే సజీవదహనమయ్యారు
వాహనానికి నిప్పు అంటుకున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కారులో రేసర్ దంపతులు సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications