• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండు అరటిపండ్లు రూ.442.. షాక్ తిన్న నటుడు.. ఎక్కడో తెలుసా..? (వీడియో)

|

చండీగఢ్ : సాధారణంగా అరటి పండ్లు ధర డజన్ రూ.30 నుంచి రూ.50 వరకు ఇస్తారు. అంటే ఒక్కో పండు దాదాపు 4 రూపాయలు పడుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి అరటిపండ్లను తినాలని కూడా వైద్యులు సూచిస్తారు. మధ్యతరగతి వారు ఎక్కువగా తీసుకునే పండు కూడా అరటి. అయితే స్టార్ హోటల్లో అరటి పండ్ల ధరలు ఎలా ఉంటాయో మిడిల్ క్లాస్ వారికీ తెలియదు. కానీ అరటిపండ్లు తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చిన నటుడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ధర చూసి నోరెళ్లబెట్టాడు.

కళ్లు బైర్లు కమ్మాయి ..

బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ .. షూటింగ్ కోసం చండీగఢ్ వెళ్లాడు. అయితే అక్కడ ఉండేందుకు జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో దిగారు. అయితే ఎప్పుడూ జిమ్ చేసే రాహుల్ .. భోజనం తర్వాత అరటి పండ్లు తినడం అలవాటు. ఎప్పటిలాగే ఆ హోటల్లో కూడా రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే పండ్లు వచ్చాయి. కానీ తర్వాత బిల్లు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయ్యింది బోస్‌కు. ఎందుకో తెలుసా .. ఆ ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది రెండు అరటి పండ్లకు రూ.442.50 బిల్ వేశారు. దీంతో నోటి నుంచి మాట కూడా రాలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Rahul Bose shocked over banana bill at Chandigarh 5-star hotel

డు యు బిలీవ్ దిస్ ..

ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. దానికి క్యాప్షన్ మీరు నమ్ముతారా అని పెట్టి యూజర్లకు ఆసక్తి కలిగించారు. మీకు ఎవరు చెప్పారు పండ్లు హానికరం కాదని, హానికరమేనని చెప్పారు. తాను ఉన్న హోటల్ పేరు రాసి వారు తనకు రెండు అరటిపండ్లకు వేసిన బిల్లును ప్రస్తావించారు ట్వీట్‌లో. అయితే వారు తనను మరీ అంత మంచి వారనుకున్నారో ఏమో కానీ .. బిల్లు మాత్రం చాంతాడంత వేశారని పేర్కొన్నారు. బోస్ వీడియోకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది మధ్యతరగతి వారే రియాక్టయ్యారు. అంతేకాదు మేం మిమ్మల్ని నమ్ముతున్నామని .. హోటల్ యాజమాన్యం తీరును తప్పుపట్టారు. ఐదు నక్షత్రాల హోటళ్లు అంటే అందులో వచ్చే బిల్ కూడా ఆకాశంతో పోటీ పడతాయని వినియోగదారులు గమనించాలని బోస్ ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

English summary
when Rahul Bose decided to stay at a 5-star hotel in Chandigarh recently, where he was shooting, he was in for a massive shock. The actor ordered room service for two bananas, but when the bill arrived, he was in for an unpleasant surprise. For the two bananas that he ordered, the hotel charged Bose Rs 442.50. He shared his disbelief with his followers on Twitter through a video, which he captioned, "You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more