వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపట్నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర- కన్యాకుమారి-కశ్మీర్-150 రోజుల్లో 3570 కి.మీ-ప్రత్యేకతలివే..

|
Google Oneindia TeluguNews

భారత్ లో అధికార బీజేపీ సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ రేపటి నుంచి భారత్ జోడో యాత్ర సాగించబోతున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ యాత్ర ద్వారా భారత్ ను ఏకం చేసేందుకు రాహుల్ సంకల్పించారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం టానిక్ గా పనిచేస్తుందని, రాహుల్ ఇమేజ్ మారుస్తుందని భావిస్తున్న ఈ యాత్రపై రాజకీయ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

 రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

దేశంలో విపక్షాల అనైక్యత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ మరోసారి అధికారం దక్కించుకోవడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటినుంచే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గాడిన పెట్టేందుకు, విపక్షాల్ని ఐక్యం చేసేందుకు కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో జనం ముందుకు వస్తున్నారు.

ఇప్పటివరకూ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు, లేదా జాతీయ పార్టీల ప్రాంతీయ నేతలే యాత్రలు సాగించగా.. ఇప్పుడు జాతీయ స్దాయి నేత అయిన రాహుల్ గాంధీ తొలిసారి ఈ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకోనున్న రాహుల్ గంటసేపు ప్రార్ధనలో పాల్గొంటారు. అనంతరం మహాత్మాగాంధీ మండపానికి వెళ్లి అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ నుంచి త్రివర్ణ పతాకాన్ని స్వీకరిస్తారు. అసలు యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది.

 కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ

రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమవుతుంది. 12 రాష్ట్రాల్లో 3570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగబోతోంది. ఇందులో మొత్తం 119 మంది కాంగ్రెస్ నేతలు యాత్రికులుగా పాదయాత్ర చేయబోతున్నారు. వీరంతా రాహుల్ తో కలిసి ప్రతీ రోజూ యాత్ర సాగిస్తారు.

వివిధ రాష్ట్రాల్లో స్ధానిక కాంగ్రెస్ నేతలు,విపక్ష పార్టీల నేతలు మధ్యలో కలిసి రాహుల్ కు సంఘీభావం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ యాత్ర 150 రోజుల పాటు సాగి కశ్మీర్ లో ముగియనుంది. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను కాంగ్రెస్ ఇప్పటికే విడుదల చేసింది.

ఐదునెలల పాటు రోడ్లపైనే రాహుల్

ఐదునెలల పాటు రోడ్లపైనే రాహుల్

భారత్ జోడో యాత్రలో భాగంగా 119 మంది కాంగ్రెస్ నేతలతో కలిసి పాదయాత్ర చేపట్టబోతున్న రాహుల్ గాంధీ.. దీన్ని నిరంతరాయంగా సాగించబోతున్నారు. తనపై ఉన్న క్లాస్ ఇమేజ్ ను పక్కనబెట్టి మాస్ నేతగా ఎదిగేందుకు రాహుల్ దీన్ని పూర్తి స్దాయిలో వాడుకోబోతున్నారు. కాంగ్రెస్ డీఎంకేతో పాటు అధికారంలో ఉన్న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించే ఈ యాత్ర తిరిగి కశ్మీర్ లో ముగిసే వరకూ రాహుల్ తో పాటు యాత్రికులంతా ఐదునెలల పాటు రోడ్లపైనే ఉండబోతున్నారు.

అక్కడే వండుకుని, తిని రోడ్ల పక్కనే నిద్రించబోతున్నారు. ఇందుకోసం 59 కంటెయినర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ట్రక్కులపై తీసుకెళ్లి క్యాంప్ సైట్లలో ఉంచి వాడుకుంటారు.

భారత్ జోడో యాత్రికుల ప్రత్యేకతలివే

భారత్ జోడో యాత్రికుల ప్రత్యేకతలివే

ఈ సుదీర్ఘ పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పాల్గొనే 119 మంది యాత్రికులను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. వీరి సగటు వయస్సు 38 ఏళ్లు. రాజస్దాన్ కు చెందిన 58 ఏళ్ల విజేంద్రసింగ్ మహ్లావత్ ఈ యాత్రలో పాల్గొనే వారిలో పెద్దవారు కాగా.. అరుణాచల్ ప్రదేశ్ చెందిన 25 ఏళ్ల ఆజమ్ జోంబ్లా, బేం బాయ్ కనిష్ట వయస్సు కలిగిన వారు కావడం విశేషం.

ఈ 119 మందిలో 28 మంది మాత్రమే మహిళలు. 119 కోర్ యాత్రికులు 119 మంది ప్రధాన యాత్రికులు, భద్రతా సిబ్బంది, ఫోటోగ్రాఫర్‌లతో కూడిన పార్టీ కమ్యూనికేషన్ బృందం, సోషల్ మీడియా సిబ్బంది మరియు వైద్య బృందం యాత్రలో ప్రయాణిస్తుంటారు.

యాత్రలో పాల్గొనే వారంతా తెల్లదుస్తులు ధరిస్తారు.యాత్ర సగటున రోజుకు 22-23 కి.మీలు ప్రయాణించి, ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు నడుస్తారు. ఆపై మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమై రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతుంది.

English summary
rahul gandhi's 150 days lasting bharat jodo yatra will begins tomorrow in kanayakumari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X