Vote Chori: పక్కా ప్లాన్ తో ఓట్ల చోరీ-సాఫ్ట్ వేర్ తో డిలీట్-బీఎల్వోకూ తెలియకుండా..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ బయటపెట్టిన కర్నాటక ఓట్ల చోరీ సంచలనం రేపుతోంది. రాహుల్ చెప్పిన దాని ప్రకారం ఓట్ల చోరీ పక్కా వ్యూహంతోనే జరుగుతున్నట్లు అర్దమవుతోంది. వాస్తవానికి ఒకరిని ఓటర్ల జాబితాలో చేర్చాలన్నా, లేదా తొలగించాలన్నా బూత్ లెవెల్ అధికారుల పాత్ర తప్పనిసరి. కానీ కర్నాటకలో మాత్రం వారికి తెలియకుండానే భారీ సంఖ్యలో ఓట్లు తొలగించడం, హ్యాకింగ్ తరహాలో ప్రత్యేక సాఫ్ట్ వేర్లను వాడటం చూస్తే అక్కడ ఏం జరిగిందో ఇట్టే తెలుస్తోంది.

కర్నాటకలోని అలంద్ నియోజకవర్గంలో దాదాపు 6 వేల ఓట్లను, అదీ మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని భారీ కుట్ర జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఇందుకు వాడిన పద్ధతి మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఇలా ఓట్ల చోరీకి వారు ఎంచుకున్న సమయం తెల్లవారు జామున 4 గంటలుగా తేలింది. అలాగే ఈ ఓట్ల చోరీకీ స్థానిక బూత్ లెవెల్ అధికారులకూ ఎలాంటి సంబంధం లేదని తేలింది. తనకు తెలియకుండానే ఇలా తన పరిధిలోని ఓట్లు తొలగించినట్లు బూత్ లెవెల్ అధికారి చెప్పిన మాటల్ని రాహుల్ ప్రదర్శించారు.

Rahul Gandhi Alleges Remote Voter Deletions with software No Booth-Level Officers Involved

అలాగే ఓట్ల చోరీ చేసిన వారు ఇతర రాష్ట్రాల నుంచి హ్యాకింగ్ తరహాలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ వాడి వీటిని తొలగించినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో స్థానిక బూత్ లెవెల్ అధికారులకు తమ లాగిన్ నుంచి ఈ ఓట్లు ఎలా తొలగింపుకు గురయ్యాయో అర్ధం కాలేదు. కాల్ సెంటర్ తరహాలో ఈ కుట్రకు పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు. అలాగే ఈ ఓట్ల తొలగింపుపై దర్యాప్తు చేపట్టిన కర్నాటక సీఐడీ విభాగం ఆరోపణల్ని నిర్ధారించింది. వీటిని సీఈసీ జ్ఞానేష్ కుమార్ దృష్టికి అధికారికంగా తీసుకెళ్లింది. అయినా సీఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.

Rahul Gandhi Alleges Remote Voter Deletions with software No Booth-Level Officers Involved

మహారాష్ట్రలోని రాజూర్ నియోజకవర్గంలో కర్నాటకలోని అలంద్ నియోజకవర్గానికి విరుద్దంగా 6850 ఓట్లను జాబితాలో చేర్చినట్లు రాహుల్ ఆరోపించారు. దీనికి వాడిన పద్ధతి కూడా అలంద్ తరహాలోనే ఉన్నట్లు తెలిపారు. స్థానిక బూత్ లెవెల్ అధికారులకు తెలియకుండా వేరే రాష్ట్రాల నుంచి సాఫ్ట్ వేర్ సాయంతో ఇలా ఓట్లను యాడ్ చేసినట్లు రాహుల్ తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఇలా తాము ఒక్కో రాష్ట్రం, అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల వివరాలు బయటపెడతామని, వాటికి ఈసీ సమాధానం చెప్పకపోతే దేశంలో యువతకే ఓట్ల చోరీపై అవగాహన వచ్చేస్తుందని రాహుల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+