మనసుకు బాధగా ఉంది: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక

వయనాడ్‌లో పరిస్థితులు మనసుకు బాధ కలిగించాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. బాధితులను పరామర్శించేందుకు గురువారం ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ గాంధీ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు.

ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని చూసి రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత భయానక విషాద ఘటన వయనాడ్‌లో చోటు చేసుకుంది. ప్రజలు తమ ఇళ్లు, కుటుంబసభ్యులను కోల్పోవడం బాధకరమన్నారు. ఇలాంటి సమయంలో వారిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi and Priyanka visits Wayanad flood affected areas

తన తండ్రి (రాజీవ్ గాంధీ) చనిపోయినప్పుడు ఎలా బాధపడ్డానో? .. ఈరోజు అలాగే అనిపిస్తోంది అని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు. తన దృష్టిలో ఇది జాతీయవిపత్తే అని చెప్పారు. ఈ ఘటనలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. కేరళకు జరిగిన నష్టం దేశానికి తీరని విషాదమని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయం చేసే సమయం కాదని అన్నారు.

బాధితులందరికీ సాయం అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి బాధితులకు రావాల్సిన సాయం అందేవరకూ కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఇలాంటి విపత్తులు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు. దీనిపై సమగ్ర ప్రణాళిక అవసరమని రాహుల్ గాంధీ తెలిపారు. వయనాడ్ పరిస్థితులు తమను కలచివేశాయన్నారు ప్రియాంక గాంధీ. బాధితులకు అవసరమైన సహాయక సహకారాలు అందాలని అన్నారు. బాధితుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

300కు చేరువైన మృతుల సంఖ్య

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300కు చేరువైంది. మృతుల్లో 25మంది చిన్నారులు, 70మంది మహిళలున్నారు. 230 మందికి పైగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+