ఈ ప్రశ్నలకు బదులివ్వండి,ఎంతమంది చనిపోయారు, పరిహరమిచ్చారా ?
ప్రధానమంత్రి మోడీకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలను సంధించారు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏ మేరకు నల్లధనం దేశంలో బయటపడిందో చెప్పాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీ: ఎ.ఐ. సి. సి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రశ్నల వర్షం కురిపించాడు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏం సాధించారో చెప్పాలని ఆయన ప్రధానిని కోరారు. పెద్ద నగదు నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ ఇతర విపక్షాలను కూడగట్టి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది.
పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నవంబర్ 8వ, తేదిన నిర్ణయం తీసుకొండి.అయితే ఈ నిర్ణయం తర్వాత ఏం సాధించారని ఆయన ప్రధానమంత్రి మోడీని ఆయన ప్రశ్నించారు. యాభై రోజుల గడువు డిసెంబర్ 30,వ తేదితో ముగిసింది.

మోదీకి ప్రశ్నలు సంధించిన రాహూల్ గాంధీ
1.నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత నల్లధనం ఎంత బయటపడిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.2. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా భారత్ ఎంత మేరకు ఆర్థికంగా నష్టపోయిందో చెప్పాలన్నారు. దీంతో పాటుగా ప్రజల ఆదాయ వనరులు ఏ మేరకు దెబ్బతిన్నాయో కూడ వివరించాలని ఆయన కోరారు.
3.పెద్ద నగదునోట్ల రద్దు వల్ల ఎంత మంది చనిపోయారు , వారికి ప్రభుత్వం పరిహరం చెల్లించిందా, చెల్లించకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన కోరారు.4. పెద్ద నగదు నోట్లన రద్దుచేసే ముందుకు ప్రధాని ఏ నిపుణులను సంప్రదించారో చెప్పాలని ఆయన కోరారు.5. పెద్ద నగదు నోట్లను రద్దుచేయడానికి ముందుగా రెండు మాసాల్లో బ్యాంకుల్లో 25 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసిన వారి వివరాలను చెప్పాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications