300 మంది చనిపోయినా చూడలేని కబోదిలు.. కేంద్రంపై రాహుల్ నిప్పులు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన సందర్భంగా 300 మంది వరకు చనిపోయారు. దీనిని అధికార బీజేపీ మాత్రం అంగీకరించలేదు. చనిపోయిన వారికి బీజేపీ నివాళులు కూడా అర్పించలేదు. దీనిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. గురువారం ఆయన రైతు నేతల వీరమరణానికి గుర్తుగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రైతుల మరణానికి సంబంధించి '300డెత్స్ ఏట్ ప్రొటెస్ట్' పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. రైతుల మరణానికి సంబంధించి అంజలి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. తాను సైలంట్‌గా ఉండటం వల్ల కొందరు కామెంట్ చేస్తున్నారని.. కానీ దానికి భయపడటం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

నిరుద్యోగం, ఈపీఎఫ్ గురించి మరో ట్వీట్ చేశారు. మీరు ఉద్యోగం కోల్పోతే.. ఈపీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయొచ్చు అని.. ఇదీ బీజేపీ ప్రభుత్వ ఘనత అని విమర్శించారు. కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో 71 లక్షల మంది ఖాతాదారులు ఈపీఎఫ్ క్లోజ్ చేయల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications