పంజాబ్‌లో గెలిచాంగా..: ఓటమి బాధ్యతకు రాహుల్ నో
ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బాధ్యత తీసుకునేందుకు నిరాకరించారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బాధ్యత తీసుకునేందుకు నిరాకరించారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడారు. గోవా, మణిపూర్‌లలో బీజేపీ ఇష్టారీతిన డబ్బు వెదజల్లుతోందన్నారు.

అయిదు రాష్ట్రాల ఫలితాలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం పంజాబ్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఘోర పరాజయం పాలైంది. మణిపూర్, గోవాలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మిత్రపక్షాలు, స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

పంజాబ్‌లో గెలిచాముగా..
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం మాట్లాడారు. యూపీ, ఉత్తరాఖండ్‌లలో ఓటమికి బాధ్యత తీసుకునేందుకు ఆయన అంగీకరించలేదు. అదే సమయంలో తమ పార్టీ పంజాబ్‌లో గెలిచిందని చెప్పారు. మణిపూర్, గోవాలలో ఎక్కువ స్థానాలు గెలిచిందన్నారు.

అవి బ్యాడ్ ఫలితాలేం కాదు
బీజేపీ పైన తమ పోరాటం సిద్ధాంతపరమైనదని చెప్పారు. పంజాబ్, గోవా, మణిపూర్‌లలో తాము గెలిచామని, అవి అంత బ్యాడ్ ఫలితాలు ఏమీ కావని చెప్పారు. బీజేపీ విభేదాలు సృష్టించి గెలిచిందన్నారు. గవర్నర్ పదవిని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు.

బీజేపీ డబ్బు జల్లుతోంది
గోవా, మణిపూర్‌లలో అప్రమత్తమై.. ఇతరుల మద్దతు కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందా అని అడిగితే... రాహుల్ గాంధీ సూటిగా సమాధానంచెప్పలేదు. అక్కడ ఆలస్యం గురించి తర్వాత అని, కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్దఎత్తున డబ్బులు వెదజల్లుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications