బీజేపీని ద్రోణుడితో పోల్చిన రాహుల్-రాజ్యాంగం స్ధానంలో మనుస్మృతిపై ఫైర్..!
పార్లమెంట్ లో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగ ఇవాళ లోక్ సభలో విపక్ష రాహుల్ గాంధీ మాట్లాడారు. గతంలో తన రెండు ప్రసంగాల్లో అభయ ముద్ర గురంచి మాట్లాడినట్లు రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అంతా మన రాజ్యాంగాన్ని సుదీర్గంగా ఉందని మెచ్చుకుంటుంటన్నారు. ఒకే సిద్ధాంతంపై ఆధారపడి దీన్ని రూపొందించారు. రాజ్యాంగం తెరిస్తే అంబేద్కర్, నెహ్రూ, గాంధీ ఆలోచనలు కనిపిస్తాయన్నారు. ఇవన్నీ శివుడు, గురునానక్, కబీర్, మహావీరుడి నుంచే వచ్చాయన్నారు. ఇది ఆధునిక భారత రాజ్యాంగ పత్రం అన్నారు.
ఆరెస్సెస్ అధినేత రాజ్యాంగం గురించి చెప్పిన మాటలతోనే తాను ప్రసంగం ప్రారంభిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. భారతీయుల గురించి రాజ్యాంగంలో లేదని, కానీ మనుస్మృతి బారతీయ ఆలోచనలతో ఉందని అన్నారన్నారు. శతాబ్దాలుగా మనుస్మృతి దేశం ఎలా నడవాలో తెలిపిందన్నారు. కాబట్టి మనుస్మృతే చట్టం అన్నారు. ఈ మాటలన్నీ సావర్కర్ వే అన్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కకుబెట్టేలా ఆయన పుస్తకం రాశారన్నారు. ఈ మాటలకు మీరు కట్టుబడి ఉంటారా అని బీజేపీని ఆయన ప్రశ్నించారు.

పెరియార్, బసవన్న, పూలే, అంబేద్కర్, గాంధీ గురించి మాట్లాడేందుకు బీజేపీ ఆలోచిస్తోందని, కానీ వీరి కంటే ముందు భారత్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే తిరిగి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడి కథను రాహుల్ సభలో వినిపించారు. ద్రోణాచార్యుడు ఏ విధంగా అయితే ఏకలవ్యుడికి కీలకమైన బ్రొటనవేలు తీసుకున్నాడో అలాగే బీజేపీ ఇప్పుడు దేశ ప్రజల వేలును తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు.
అదానీకి ధారావిని రాసిస్తారని, ఇందుకోసం అక్కడి చిన్న వ్యాపారుల బొటనవేలు తీసేస్తారని బీజేపీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో నిజాయితీగా వ్యాపారం చేసుకునే వ్యాపారుల వేళ్లను అదానీ కోసం తీసేసుకుంటారన్నారు. లేటరల్ ఎంట్రీ పేరుతో పేదల వేళ్లు తీసేసుకుంటున్నారని విమర్శించారు. ఏకలవ్యుల తరహాలో దేశంలో యువత వివిధ పరీక్షల కోసం సిద్దమయ్యే వారని, ఉదయం లేచి పరుగులు తీసేవారని, కానీ అగ్నివీర్ తెచ్చి వాళ్ల వేలు కోసేశారన్నారు.
ఇవాళ రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని, వాళ్లు మద్దతుధర అడుగుతుంటే అదానీ, అంబానీ కోసం వాళ్ల వేళ్లు కోసేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దేశంలో గుత్తాధిపత్యం ఉండాలని, అగ్నివీర్ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదన్నారు. హత్రాస్ లో బాలిక ను గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లు బయట తిరుగుతున్నారని, కానీ బాలిక కుటుంబాన్ని ఇంట్లో పెట్టి నిర్బంధించారన్నారు. గ్యాంగ్ రేప్ కు గురైన బాలిక అంత్యక్రియలు కూడా జరగనివ్వలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో రాజ్యాంగం అమలు కావడం లేదని, మనుస్మృతి అమలవుతోందన్నారు. హత్రాస్ బాలిక కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకపోతే ఇండియా కూటమి స్వయంగా ఆ పని చేస్తుందన్నారు.
సంభాల్ లో మసీదు వివాదం జరిగితే ఐదుగురు దీంతో సంబంధం లేని అమాయకుల్ని కాల్చిచంపేసారని రాహుల్ ఆరోపించారు. ఓ మతాన్ని మరో మతంతో గొడవలు పెట్టాలని, దళిత కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగం అమలు చేయాలనేది ఇండియా కూటమి డిమాండ్ అన్నారు. బీజేపీ ఎవరెవరి వేళ్లను ఎక్కడ కోసిందో తాము కుల గణన చేసి నిరూపిస్తామన్నారు. అలాగే 50 శాతం రిజర్వేషన్ల గోడను కూడా ఇక్కడే బద్దలు కొడతామన్నారు.












Click it and Unblock the Notifications