2015 ఐఏఎస్ టాపర్స్: రెండో ర్యాంకర్ అమీర్ ఖాన్‌తో టీనా పెళ్లి, రాహుల్ గాంధీ ట్వీట్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: 2015 సివిల్స్ పరీక్షల్లో టాపర్స్‌గా నిలిచిన టీనా దాబీ, అథల్ అమీర్ ఖాన్‌లు పెళ్లి చేసుకోవడంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. నాడు సివిల్స్ పరీక్షల్లో టీనా తొలి స్థానంలో నిలవగా, అథల్ ఆ తర్వాత స్థానంలో నిలిచారు.

వివాహం చేసుకొన్న 2015 ఐఎఎస్ టాపర్లు, ఎవరో తెలుసా?

వీరి ఫోటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంటులో పోస్టు చేశారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ టాపర్స్ టీనా దాబీ, అథర్ అమీర్ ఉల్ షఫీలకు వారి పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

 భగవంతుడి ఆశీస్సులు

భగవంతుడి ఆశీస్సులు

మీ (టీనా దాబీ, అథల్ అమీర్ ఖాన్) ప్రేమ ఎందరికో ఆదర్శం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసహనం, మత విద్వేశాలు కొనసాగుతున్న ఈ సమయంలో మీ ప్రేమ అందరికీ స్ఫూర్తిదాయకం అని కాంగ్రెస్ అధ్యక్షులు పేర్కొన్నారు. మీకు భగవంతుడి ఆశీస్సులు అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేశారు.

టీనాదీ భోపాల్, అమీర్ ఖాన్‌ది కాశ్మీర్

టీనాదీ భోపాల్, అమీర్ ఖాన్‌ది కాశ్మీర్

కాగా, 22 ఏళ్ల టీనా దాబీ 2015 ఐఏఎస్ ఫలితాల్లో తొలి స్థానంలో నిలిచింది. అమీర్ ఉల్ షఫీ ఖాన్ అవే ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టీనా దాబీ భోపాల్‌కు చెందిన యువతి. అమీర్ ఖాన్ కాశ్మీర్‌కు చెందినవారు.

 మూడేళ్ల ప్రేమ, శనివారం ఒక్కటయ్యారు

మూడేళ్ల ప్రేమ, శనివారం ఒక్కటయ్యారు

ఈ జోడీ శనివారం నాడు దక్షిణ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన టీనా దాబీ ప్రస్తుతం అజ్మీర్‌లో సేవలు అందిస్తున్నారు. శిక్షణలో ఉండగా వీరిద్దరు ప్రేమించుకున్నారు. శిక్షణ పూర్తయ్యాక నిశ్చితార్థం చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని ముందే అనుకున్నారు.

గోప్యంగా ఉంచలేదు, కుటుంబం సంతోషం

గోప్యంగా ఉంచలేదు, కుటుంబం సంతోషం

వీరిద్దరు తమ ప్రేమను గోప్యంగా ఉంచలేదు. ఇరువురు కలిసి ఉన్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేవారు. చాలామంది వీరి ప్రేమను మెచ్చుకున్నారు. తన నిర్ణయం పట్ల తన కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషంగా ఉన్నారని టీనా చెప్పారు. కాగా టీనా తల్లి మాజీ ఏఐఎస్ ఆఫీసర్ కాగా, తండ్రి ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Congratulations Tina Dabi & Athar Amir-ul-Shafi, IAS toppers, batch of 2015, on your wedding! May your love grow from strength to strength and may you be an inspiration to all Indians in this age of growing intolerance and communal hatred.' Rahul Gandhi tweeted.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X