Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi Disqualification: తెలంగాణలో మోదీ దిష్టి బొమ్మ దగ్ధం..!

లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తమ నాయకుడిపై అనర్హత వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ పలు రూపాల్లో మీదీ సర్కార్‌ పై నిరసన తెలిపింది. 2019లో మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న పిటిషన్‌పై సూరత్ కోర్టు విచారణ చేసి రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రెండేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడంటూ లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాడు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాన్ని వారు తప్పుబట్టారు. మోదీ సర్కార్ ప్రశ్నించిన వారి గొంతును నొక్కేస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని కార్యకర్తలు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ దగ్ధం చేసింది. ఖమ్మంలో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంభాని చంద్రశేఖర్ నేతృత్వంలో నిరసనలు తెలిపారు.రాహుల్ పై వేటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క చెప్పారు.

Rahul Gandhi Disqualification:Congress Protests erupts in Hyderabad and across country
కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు రాహుల్ గాంధీ.శనివారం రోజున కార్యకర్తలు బ్లాక్‌డేగా పాటించారు. పలు విధాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ నిరసన కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేశారు వాయనాడ్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.

ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ముందు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ మాస్కులు ధరించి తమ నిరసన తెలిపారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, ఒకరికి తలవంచే ప్రసక్తే లేదని చెప్పే ఫ్లకార్డులను ప్రదర్శించారు. సత్యం కోసం గాంధీ కుటుంబం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లకార్డులను ప్రదర్శించారు.


రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంతో చండీగఢ్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. న్యూఢిల్లీ-చండీగఢ్‌కు వెళ్లే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను కాంగ్రెస్ నాయకులు నిలిపివేశారు. భోపాల్‌లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ప్రజాస్వామ్యంపై ప్రభుత్వం దాడి చేస్తుందని సింబాలిక్‌గా చెప్పేందుకు తమ నోళ్లకు తాళం వేసుకుని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+