అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!

2018లో కర్నాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో ఇవాళ యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని యూపీ స్థానిక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కీలకమైన యూపీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీతో పాటు విపక్ష కూటమికీ ఊరట లభించినట్లయింది.

రాహుల్ కు అధికారం అప్పుడే..! విదేశీ టూర్ పై అమిత్ షై పంచ్ లు..!
రాహుల్ కు అధికారం అప్పుడే..! విదేశీ టూర్ పై అమిత్ షై పంచ్ లు..!

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో జరిగిన ఒక ప్రచార సభలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై యూపీలోని ఆ పార్టీ నేత విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్.. 2024 ఫిబ్రవరి 20న కోర్టు ఎదుట లొంగిపోగా, ఆయనకు బెయిల్ మంజూరైంది. 2024 జూలై 26న ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు, ఆ తర్వాత ఫిర్యాదుదారు, ఇతర సాక్షులను విచారించారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో రాహుల్ గాంధీ వాయిస్ శాంపిల్‌ను సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టు, అలహాబాద్ హైకోర్టు కొట్టేశాయి. ఈ కేసులో రాహుల్ గాంధీ స్వయంగా ఇవాళ కోర్టుకు హాజరై నిర్దోషిగా విడుదలయ్యారు.

Rahul Gandhi Gets Relief as UP Court Acquits Him in Amit Shah Defamation Case
సహకార ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ వరుస షాక్ లు- ఈసారి మహారాష్ట్రలో..!
సహకార ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ వరుస షాక్ లు- ఈసారి మహారాష్ట్రలో..!

అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 2018లో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో, యూపీలోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. ఇవాళ కోర్టు తుది తీర్పు నేపథ్యంలో రాహుల్ స్వయంగా హాజరయ్యారు. మొత్తం 8 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో ఎట్టకేలకు రాహుల్ గాంధీ విడుదల కావడంతో యూపీలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని మిత్రపక్ష నేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై పైచేయి సాధించేందుకు ఈ తీర్పు వీలు కలిగించింది.మరోవైపు ఇవాళ ఈ కేసులో హాజరయ్యేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ లో వాహనాలు ఎక్స్ ప్రెస్ వేపై ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాహుల్ క్షేమంగా బయటపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+