మాయావతి నిర్ణయం ప్రభావం చూపదు: తెలంగాణతోపాటు రాష్ట్రాల పొత్తులపై రాహుల్ ఏమన్నారంటే?

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటవుతున్న మహా కూటమిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో వచ్చేవారితో కలిసి వెళతామని, విభేదించే వారితో తమకు పని లేదని అన్నారు.

 మాయావతి నిర్ణయం ప్రభావం చూపదు

మాయావతి నిర్ణయం ప్రభావం చూపదు

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఒంటరిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని ఇటీవల మాయావతి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్.. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించినప్పటికీ సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మాయావతి పొత్తుకు అంగీకరించలేదు.

తెలంగాణతోపాటు ఆ మూడు రాష్ట్రాల్లో..

తెలంగాణతోపాటు ఆ మూడు రాష్ట్రాల్లో..

ఈ నేపథ్యంలో హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పొత్తు అంశం తమపై పెద్దగా ప్రభావం చూపదని అన్నారు. అయితే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తోపాటు తెలంగాణ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరుగా పొత్తులు

కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరుగా పొత్తులు

పొత్తుల గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కేంద్రం, రాష్ట్రాల్లో పొత్తులు వేర్వేరు. మాయావతీజీ దాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో మాకు అనుకూలత ఉంది. మేం చర్చల్లో ఉండగానే వాళ్లు వాళ్ల దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు' అని రాహుల్ గాంధీ వివరించారు.

లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ...

లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ...

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశముందని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ అవకాశం ఎక్కువగా ఉందని రాహుల్ చెప్పారు. యూపీలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతోనూ పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేస్తూనే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తమతో కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సీట్ల సర్దుబాటు అందరికీ అనుకూలంగా ఉంటేనే ఈ మహా కూటమి ఎన్నికల వరకు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే మళ్లీ ఎవరికీ వారే వేర్వేరుగా బరిలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+