ఉత్తరాఖండ్‌లో సేద తీరుతున్న రాహుల్ గాంధీ: ట్విట్టర్‌లో ఫోటోలు
న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి సెలవు తీసుకున్న కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఆయన ఉత్తరాఖండ్‌లో సేద తీరుతున్నారనే విషయాన్ని ట్విట్టర్ ఫొటోలు బయటపెట్టారు. కాంగ్రెసు నాయకుడిగా భావిస్తున్న జగదీష్ శర్మ - ఉత్తరాఖండ్‌లో ఉన్నారంటూ కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే, జగదీష్ శర్మ మాటలను రాహుల్ గాంధీ కార్యాలయం కొట్టిపారేస్తోంది. ఆత్మపరిశీలన చేసుకుని, భవిష్యత్తు కార్యాచారణను రూపొందించుకోవడానికి రెండు వారాల పాటు సెలవు తీసుకున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్నారని జగదీష్ శర్మ అంటున్నారు. తన వాదనను సమర్థించుకోవడానికి ఆయన ట్విట్టర్‌లో ఫోటోలు పెట్టారు.

బ్యాంకాక్‌లో రాహుల్ గాంధీ ఉన్నారనే వార్తల్లో నిజం లేదని చెప్పడానికి తాను ఫొటోలను పోస్టు చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ సెలవు తీసుకోవడాన్ని దిగ్విజయ్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు తప్పు పడుతున్నారు.

జగదీష్ శర్మ చర్యను ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో ఖండించారు. కాంగ్రెసుతో గానీ గాంధీలతో గానీ జగదీష్ శర్మకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. తాను లోకసభకు గైర్హాజరవుతున్న విషయంపై రాహుల్ గాంధీ లోకసభ సచివాలయానికి ఏ విధమైన లేఖ ఇవ్వలేదని సమాచారం.













Click it and Unblock the Notifications