వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌గాంధీ నాకు నాయకుడు కాదు, ప్రియాంక రాజకీయాల్లోకి రావాలి: హర్ధిక్ పటేల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై పటీదార్ అనమత్ ఆందోళన్ సమితి నేత హర్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాందీ తనకు నాయకుడు కాదని ఆయన స్పష్టం చేశారు.

ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్‌ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదన్నారు హర్థిక్ పటేల్. తన దృష్టిలో రాహుల్‌ నాయకుడే కాదని తెలిపాడు. అదే సమయంలో రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ హర్ధిక్‌ ఆహ్వానించాడు. శుక్రవారం నాడు హర్దిక్ పటేల్ ముంబైలో ఈ వ్యాఖ్యలు చేశారు.

'Rahul Gandhi Is Not My Leader', Says Hardik Patel

ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్‌ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. కానీ, అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నానని చెప్పారు.ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా హర్ధిక్ పటేల్ అభిప్రాయపడ్డారు.

ఇక 2019 ఎన్నికల్లో పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్‌) తరపున పోటీ చేయబోనని హర్ధిక్‌ స్పష్టం చేశాడు. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హర్ధిక్‌ పోటీ చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోనని కూడ హర్ధిక్ పటేల్ ప్రకటించారు.తాను పోటీ చేయాలని భావిస్తే తనను ఎవరూ కూడ అడ్డుకోలేరని హర్ధిక్ పటేల్ చెప్పారు.

English summary
Hardik Patel, the 24-year-old face of the Patidar campaign in Gujarat, said he did not consider Congress president Rahul Gandhi "my leader", adding that he favoured the entry of Mr Gandhi's sister Priyanka Vadra in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X