మోడీకి మాకు అదే తేడా: ప్రతి ఒక్కరికీ రూ. 15 లక్షలు, రాహుల్ గాంధీ ఫైర్, ప్రపంచ రికార్డు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మెడీ ప్రభుత్వ హామీలకు, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలకు అదే తేడా అని, ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ఆయన ఇచ్చిన హామీ ఏమైయ్యిందని, అవినీతి గురించి మాట్లాడితో ప్రపంచ రికార్డులకు ఎక్కిన కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.

రాహుల్ నోట కన్నడ బాష

రాహుల్ నోట కన్నడ బాష

కర్ణాటకలో హోస్ పేటలో శనివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనాశ్వీరాద సమావేశం (ప్రజల ఆశీర్వాద సమావేశం)లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని ప్రసగించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎల్లరిగూ నమస్కార (అందరికీ సమస్కారం) అని కన్నడలో తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  Rahul Gandhi Tweets Supporting AP MPs Protest in Parliament
  ప్రపంచ రికార్డు

  ప్రపంచ రికార్డు

  ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వచ్చి అవినీతి గురించి మాట్లాడారని, అవినీతి గురించి మాట్లాడితే ప్రపంచ రికార్డు నెలకొల్పిన కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడాలని, ఆ విషయం ప్రధాని మరిచిపోయి ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు.

  కాంగ్రెస్ కావాలా బీజేపీనా

  కాంగ్రెస్ కావాలా బీజేపీనా

  చెప్పిన హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, అపద్దాలు చెప్పే బీజేపీ మరో వైపు ఉంది, మీకు ఏ పార్టీ కావాలో తేల్చుకోవాలని రాహుల్ గాంధీ కార్యకర్తలతో అన్నారు. బీజేపీని నమ్ముకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుభవంతో చెబుతున్నానని, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాహుల్ గాంధీ కార్యకర్తకు మనవి చేశారు.

  మోడీ నోట్లో అపద్దాలు

  మోడీ నోట్లో అపద్దాలు

  ప్రధాని నరేంద్ర మోడీ నోట్లో ఎప్పుడు చూసినా అపద్దాలు వస్తాయని, ఆయన నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి మంచి జరగలేదని, ప్రజలు అందరూ కష్టాలు ఎదుర్కొన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రత్యేక అభివృద్ది కోసం సెక్షన్ 371 Jలో మార్పులు చేర్పులు చేయ్యడానికి పోరాటం చేసి విజయం సాధించామని రాహుల్ గాంధీ అన్నారు.

  ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు

  ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు

  ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చారని, మీకు ఇప్పుడు ఒక్కరూపాయి అయినా ఇచ్చారా చెప్పండి అంటూ రాహుల్ గాంధీ ప్రజలను ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామని మోడీ అన్నారని, ఉన్న ఉద్యోగాలే ఊడదీస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  మోడీ ఏం మాట్లాడారు ?

  మోడీ ఏం మాట్లాడారు ?

  లోక్ సభలో నరేంద్ర మోడీ దేశంలోని సమస్యల గురించి మాట్లాడలేదని, యువకుల ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని, రైతులకు మేలు చేసే పథకాలు ప్రవేశ పెట్టలేదని, గిరిజనులు, దళితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  మోడీకి సిద్దూకు అదే తేడా!

  మోడీకి సిద్దూకు అదే తేడా!

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని ఇంత వరకూ నేరవేర్చలేదని, కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చిందని, బీజేపీకి, కాంగ్రెస్ కు ఉన్న తేడా అదే అని రాహుల్ గాంధీ అన్నారు.

  గబ్బర్ సింగ్ ట్యాక్స్

  గబ్బర్ సింగ్ ట్యాక్స్

  నరేంద్ర మోడీ తన ప్రభుత్వ బండిని ఏ రంగంలోనూ ముందుకు నడించలేదని, నల్లఅద్దాలు పెట్టుకున్న ఆయన బండి వెనక్కి నడిపిస్తున్నారని, ముందువేనుకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు కష్టాలు పెడుతున్నారని, అందులో భాగంగా జీఎస్టీ బిల్లు వచ్చిందని, అందుకే దానిని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటామని రాహుల్ గాంధీ ప్రధాని మీద విరుచుకుపడ్డారు.

   గుజరాత్ గురించి

  గుజరాత్ గురించి

  గుజరాత్ ను తాను ఇంత అభివృద్ది చేశానని ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం చెప్పుకుంటూ తిరుగుతున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు. గుజరాత్ ను మాత్రం అభివృద్ది చేసింది అక్కడి రైతులు, వ్యాపారులు, కార్మికులు అని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే తన స్వార్థం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తనకు కావలసిన కొందరు వ్యాపారుల చేతిలో గుజరాత్ ను పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  యుద్ద విమానాల స్కాం

  యుద్ద విమానాల స్కాం

  రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందాన్ని హెచ్ఏఎల్ నుంచి మోడీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోడీ స్వార్థం కోసం ఏమైనా చెయ్యడానికి వెనకడుగు వెయ్యరని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  ప్రముఖులు హాజరు

  ప్రముఖులు హాజరు

  ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, కేంద్ర మాజీ మంత్రి వీరప్పమెయిలీ, కేపీసీసీ ఎన్నికల ప్రచార కమిటి ఇన్ చార్జ్, మంత్రి డీకే శివకుమార్, రెబల్ స్టార్ అంబరీష్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావ్, అనీల్ లాడ్, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rahul Gandhi Janashirvada rally in Hospet. Rahul Gandhi is in Karnataka on 4 days visit to kick start campaign for Congress before Karnataka Assembly Elections 2018. He will be addressing public rally in Hospet, Ballari.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి