‘రాహుల్ గాంధీ కనబడుట లేదు’: యూపీలో కలకలం

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కనబడటం లేదంటూ వెలిసిన పోస్టర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించాయి.

లక్నో: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కనబడటం లేదంటూ వెలిసిన పోస్టర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో తమ ఎంపీ రాహుల్‌గాంధీ కనబడటంలేదంటూ పదుల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ఆయన చిత్రంతో కూడిన పోస్టర్‌ దిగువన ఆయన ఆచూకీ తెలిపితే రివార్డు ఇస్తామంటూ రాశారు.

రాహుల్‌ అమేథీకి వచ్చి ఆర్నెళ్లు అవుతోందని, రాహుల్‌ గాంధీ తీరు ఓటర్లను అవమానపరిచేలా ఉందని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అంతేగాకుండా ప్రజలు ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు రాశారు. దీంతోపాటు నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్‌ కింద జరగాల్సిన అభివృద్ధి పనులు నెమ్మదించాయంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.

‘Rahul Gandhi Missing’ Posters Emerge in Amethi

అయితే ఈ పోస్టర్లు ఎవరు ముద్రించిందీ తెలియరాలేదు. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రాహుల్‌ అవమానంతో అమేథీపై ఆసక్తి చూపడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా, గౌరీజంగ్‌ ప్రాంతంలో అకస్తాత్తుగా వెలిసిన ఈ పోస్టర్ల వెనుక బీజేపీ, ఇతర రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉండి ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+