వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మోడీ ఆహ్వానం అందలేదు’: ఒత్తిడేనని రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తనను టీ పార్టీకి పిలవలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మధ్యాహ్నం స్పష్టం చేశారు. అందుకే ‘చాయ్ పే చర్చ'కు తాను వెళ్లడం లేదని ఆయన అన్నారు.

జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రంపై ఎంతో ఒత్తిడి ఉన్నందువల్లే మోడీ చర్చా మార్గానికి వచ్చారని, ఎన్డీయే ప్రవేశపెట్టిన బిల్లులో తమకు మూడు అభ్యంతరాలున్నాయని రాహుల్ చెప్పారు. వాటిని తొలగిస్తే, మద్దతిచ్చేందుకు తాము సుముఖంగానే ఉన్నామని, అవి తొలగించకుంటే మాత్రం బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

 Rahul Gandhi, Not Invited, Says PM Called Meeting 'Under Pressure'

ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యక్రమాలను తాము అడ్డుకోబోమని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, శుక్రవారం సాయంత్రం 7గంటలకు రేస్ కోర్సులోని తన నివాసానికి రావాలని మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా జిఎస్‌టి బిల్లుకు మద్దతివ్వాలని ఈ భేటీలో కోరే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, పార్లమెంటును సజావుగా సాగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చాయ్ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు.

English summary
Shortly after it was announced that Prime Minister Narendra Modi had invited Congress president Sonia Gandhi and Manmohan Singh for discussions over tea, Rahul Gandhi said that the government had been forced to take that step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X