గోవా బీచ్‌లో రాహుల్ గాంధీ..! పర్యాటకులతో సెల్ఫీలు
పనాజీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా తీరంలో సేదదీరుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో బిజీగా గడిపిన రాహుల్.. విహారయాత్రకు గోవా వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది లేకుండా కామన్ మ్యాన్ లాగా గోవా బీచుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తల్లి సోనియాగాంధీతో కలిసి 3 రోజులు హాలిడే ప్లాన్ చేసుకున్నారు రాహుల్. అయితే గోవాలో ప్రఖ్యాతిగాంచిన సీఫుడ్ రెస్టారెంట్ కు ఆదివారం లంచ్ కు వెళ్లిన సందర్భంలో.. కొందరు పర్యాటకులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

గోవాకు చెందిన ప్రముఖ దంత వైద్యురాలు రచనా ఫెర్నాండెజ్.. రాహుల్ తో కలిసి దిగిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. లంచ్ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నారు. రాహుల్ కనిపించేసరికి ఫోటో దిగుతామంటూ అడిగారట. దీనికి రాహుల్ వెంటనే ఓకే చెప్పడం ఆనందం కలిగించిందంటున్నారు.












Click it and Unblock the Notifications