వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరీందర్‌ను సీఎంగా ఎందుకు తొలగించమంటే.. నోరువిప్పిన రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్.. ఆప్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిన్నపిల్లలు అని మాజీ సీఎం అమరీందర్ సింగ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

ఎందుకు తొలగించమంటే..

ఎందుకు తొలగించమంటే..


ఇవాళ ఫతేఘర్ సాహిబ్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. పంజాబ్ మాజీ సీఎం కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించారో తాను చెబుతానన్నారు. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు ఆయన అంగీకరించకపోవడం వల్లే సీఎంగా అమరీందర్‌ను తొలగించడానికి కారణం అన్నారు. తనకు నాకు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం ఉందని కెఫ్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారన్నారు.

డ్రగ్స్..

డ్రగ్స్..


పంజాబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కూడా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దేశానికి ముప్పు అని తాను చెబుతూనే ఉన్నానన్నారు. పంజాబ్ ప్రయోగాలు చేయవలసిన రాష్ట్రం కాదని ఇప్పుడు మళ్లీ చెబుతున్నాని అన్నారు. పంజాబ్‌లోని యువత జీవితాలను డ్రగ్స్ నాశనం చేయడం కొనసాగితే పంజాబ్‌లో అభివృద్ధి అర్థరహితమన్నారు.

రిమోట్ కంట్రోల్..

రిమోట్ కంట్రోల్..

అంతకుముందు ప్రధాని మోడీ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో రిమోట్ కంట్రోల్ సీఎంగా పనిచేయలేదనే.. కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం పదవీ నుంచి తప్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల రిమోట్ ఢిల్లీలో ఉంటుందని మోడీ ఎద్దేవా కూడా చేశారు. దీనిపై రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. మోడీ, అమరీందర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.

బీజేపీతో సన్నిహిత సంబంధాలు..

బీజేపీతో సన్నిహిత సంబంధాలు..

అమరీందర్‌ సింగ్‌కు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ముగ్గురు, నలుగురు పారిశ్రామిక వేత్తల చేతిలో పాలన ఉండేది అని వివరించారు. ఇటు ఆప్‌పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పంజాబ్ ఏమన్నా కెమిస్ట్రీ ల్యాబా.. ప్రయోగాలు చేయడానికి అని అడిగారు. విద్యుత్ సమస్య పరిష్కరించలేదని.. పేద ప్రజలను దగ్గరికీ తీయలేదని రాహుల్ చెప్పారు.

పోలింగ్..

పోలింగ్..


అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 65 సీట్లలో బరిలో ఉంది. కూటమిలోని ధిండ్సా పార్టీ 15 సీట్లలో బరిలోకి దిగుతోంది. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. కానీ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.

English summary
Amarinder Singh was linked to BJP, Congress removed him as a cm congress leader rahul gandhi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X