గుజరాత్ మాంగే జవాబ్: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ నాలుగో ప్రశ్న..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాలుగో ప్రశ్నను సంధించారు. విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని పరిశీలించినపుడు గుజరాత్ 26వ స్థానంలో ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ రోజుకొక ప్రశ్న చొప్పున అడుగుతున్నారు. 'గుజరాత్ మాంగే జవాబ్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ట్విట్టర్‌లో ఇలా ట్వీట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను పణంగా పెట్టి, విద్యను వ్యాపారాత్మకం చేసిందని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Rahul Gandhi's question number 4 for PM Narendra Modi: Why is education unaffordable in Gujarat?

యువత చేసిన తప్పు ఏమిటని నిలదీశారు. గుజరాత్‌లో విద్య కోసం ఖర్చు పెరుగుతుండటంతో విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. నవ భారతం కల ఎలా వాస్తవమవుతుందని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు.

గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 9, 14 తేదీల్లో జరుగుతాయి. . నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాలుగు ప్రైవేటు కంపెనీల నుంచి అత్యధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Continuing with his series of questions posed to Prime Minister Narendra Modi in the run up to the Gujarat Assembly election, Congress vice-president Rahul Gandhi put his fourth question today. Posted on Twitter from the handle of Office of RG - which the Congress leader uses to post on the microblogging site, Rahul Gandhi said, "Why Gujarat stands at 26th position in terms of government expenditure on education? What is the fault of the youths?" Rahul Gandhi also alleged the the Gujarat government under the BJP had preferred "business of education" at the cost of government schools and colleges. Students have suffered due to rising cost of education in Gujarat, Rahul Gandhi said adding, "How will the dream of New India be realised?"

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి