మోడీ కళ్లల్లో భయం చూశా- అదానీపై ప్రశ్నించగానే.. రాహుల్ కామెంట్స్..
ఢిల్లీ : ప్రధాని మోడీపై (pm modi) ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తీవ్ర విమర్శలకు దిగారు. తన అనర్హత వేటుపై స్పందించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రాహుల్.. ప్రధాని, అదానీపై (adani) సూటి విమర్శలు చేశారు. అదానీకే అన్నికాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో తనకు ఎదురైన పరిస్ధితుల్ని రాహుల్ వివరించారు.
అదానీ షెల్ కంపెనీల్లో ఎవరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, అవి అదానీ పెట్టుబడులు కావని రాహుల్ తెలిపారు. అదానీ, మోడీ బంధంపై తాను ప్రశ్నించానని రాహుల్ వెల్లడించారు. దీనిపై పార్లమెంటులో తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారని రాహుల్ ఆరోపించారు. తమపై వచ్చే ఆరోపణలకు జవాబు ఇచ్చే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. కానీ స్పీకర్ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.

అదానీపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పుడు ప్రధాని మోడీ కళ్లలో భయం చూశానని రాహుల్ గాంధీ వెల్లడించారు. పార్లమెంటులో అదానీపై తాను వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, కానీ తన వ్యాఖ్యల్ని మాత్రం రికార్డుల నుంచి తొలగించారన్నారు. ప్రధాని మోడీ-అదానీ బంధానికి ఇదే నిదర్శనం అన్నారు. అదానీ గురించి అడిగితే దేశంపై దాడి అంటున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ మాజీ ఎంపీ తెలిపారు.












Click it and Unblock the Notifications