Adani US bribe case: అదానీని రక్షించేది మోదీనే!

ప్రస్తుతం దేశంలో భారతీయ బిలియనీర్ అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానిపైన లంచం ఇవ్వజూపారని, మోసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలతో న్యూయార్క్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో భారతదేశంలో దీనిపైన తీవ్రంగా కలకలం రేగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ వ్యవహారం పైన స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ గౌతమ్ అదానీ వ్యవహారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.

అదానీని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారు
దేశంలో అవినీతి అక్రమాలు జరిగాయి అంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, కానీ అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అదానీని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని, లేకుంటే ఇప్పటికే ఆయన అరెస్టు కావలసి ఉందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. భారత చట్టాలను, అమెరికా చట్టాలను అదానీ ఉల్లంఘించారని నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు .

Rahul gandhi shocking comments after US Charges Adani should be arrested today PM Modi protecting him

అదానీ అరెస్ట్ కు రాహుల్ గాంధీ డిమాండ్
సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణల వ్యవహారంలో గౌతమ్ అదాని మరో ఏడుగురు తో కలిసి భారత్లోని భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్.బి.ఐ చెబుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక నిధులను సమీకరించడం కోసం బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా సంచలన ఆరోపణలు వెలువెత్తుతున్న వేళ ఆయనను అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు
అమెరికాలో అదాని లంచం, మోసం ఆరోపణలు స్పష్టంగా నిరూపించబడినప్పటికీ, అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. గతంలో కూడా అనేక సందర్భాలలో అదాని కుంభకోణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు సాక్షిగా చెప్పామని, అయినప్పటికీ అదానిపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం ముందుకు రాలేదన్నారు.

అదానీ విషయంలో మా డిమాండ్ ఇదే
ఎందుకంటే 100% ప్రధాని మోదీనే ఆయనను కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీ అక్రమాలపై విచారణ జరపడం కోసం జె పి సి ని ఏర్పాటు చేయాలని కూడా తమ ముందు నుంచి డిమాండ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అదే కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో కచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని, ఎక్కడ అదానీ అవినీతికి పాల్పడిన కచ్చితంగా విచారణ జరపాల్సిందేనన్నారు.

అదానీని అరెస్టు చేస్తే చాలా విషయాలు బయటకు
అంతేకాదు అదానికి తోడుగా ఉన్న వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అదానీ ని అరెస్టు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అందుకే ఆయనపై విచారణ జరపరని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+