రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం: మోడీ, బీజేపీపై రాహుల్ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు మహారాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడంతోపాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.

సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్‌లో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటను ఉద్దేశించి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజలను భయపెడుతూ.. రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ.. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఎదుట తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాహుల్ మండిపడ్డారు. శివాజీ అందించిన సందేశం దేశమంతటికీ వర్తిస్తుందన్నారు.

Rahul Gandhi slams PM Modi and Maharashtra govt in Kollapur

ఛత్రపతి, సాహూ మహరాజ్ లాంటి యోధులు లేకపోయి ఉంటే.. నేడు మనకు రాజ్యాంగం ఉండేది కాదన్నారు రాహుల్ గాంధీ. దళితులు, వెనుకబడిన వర్గాల చరిత్రను పాఠశాలల్లో బోధించడం లేదని, ఆ చరిత్రను చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు.

మరోవైపు, సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో కూడా రాహుల్ పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు పార్లమెంటులో చట్టాలను సవరించేలా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కృషిచేస్తాయని రాహుల్ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కుల గణనపై చట్టం ఆమోదం పొందేలా చూస్తామని, దానిని ఏ శక్తి అడ్డుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని కాపాడేందుకు మొట్టమొదటగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే రిజ్వర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని రాహుల్ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించానని తెలిపారు. అది ఆరంభం మాత్రమేనని, 50 శాతం పరిమితి ఇప్పుడు మన ముందున్న అవరోధమని చెప్పారు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి లోక్‌సభ, రాజ్యసభలో మారుస్తాయని రాహుల్ హామీ ఇచ్చారు.

కాగా, భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో రాజ్‌కోట్‌ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయగా తీవ్ర దుమారం రేపింది. నాణ్యతా లోపం కారణంగా విగ్రహం కూలిపోయిందంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే, మహారాష్ట్రలో పర్యటించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. శివాజీకి తలవంచి క్షమాపణలు తెలియజేశారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదన్నారు.ఈ నేపథ్యంలోనే రాహుల్ తాజాగా విమర్శలు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+