ఆ రెండు నియోజకవర్గాలపై సస్పెన్స్‌కు తెర: పోటీకి సై

Rahul Gandhi: మూడో విడత లోక్‌సభ ఎన్నికల కోసం దేశ యావత్తూ సర్వ సన్నద్ధమౌతోంది. ఈ నెల 7వ తేదీన మూడవ విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. కర్ణాటకలో మలిదశ సహా మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 94 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతుందా రోజున.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ అదే రోజున పోలింగ్ ఉంటుంది. మొత్తం 26 సీట్లకూ ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాల ఓటర్లు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

Rahul Gandhi to file nomination from Raebareli and KL Sharma from Amethi

ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్/ఇండియా కూటమి అభ్యర్థులు రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడింది. ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి కూడా ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. రెండో స్థానంగా రాయబరేలీని ఎంచుకున్నారు.

Rahul Gandhi to file nomination from Raebareli and KL Sharma from Amethi

ఒక్కసారి మినహా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓడిపోని నియోజకర్గం- రాయబరేలీ. సోనియాగాంధీ సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సారి పోటీ చేయట్లేదు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు.

దీనితో రాయబరేలీ నుంచి ఎవరిని బరిలో దించాలనే విషయంపై ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం కొనసాగింది. నేడు నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి గడువు కావడంతో దీనికి తెరదించింది. రాయబరేలీ నుంచి సోనియాగాంధీ వారసుడిగా రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు.

Rahul Gandhi to file nomination from Raebareli and KL Sharma from Amethi

అదే సమయంలో అమేథీ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కేఎల్ శర్మ ఇక్కడ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం బీజేపీ జెండా ఎగురుతోందీ స్థానంపై. 2019 నాటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ ఓడిపోయిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గెలిచారు. ఈ స్థానం నుంచి కేఎల్ శర్మకు టికెట్ ఇచ్చింది. సోనియాగాంధీకి అత్యంత ఆప్తుల్లో ఒకడిగా పేరుందాయనకు.

10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గల లోక్‌సభ స్థానాలతో పాటు రాయబరేలీ, అమేథీలకూ అయిదో విడతలో అంటే మే 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికే నేడే తుది గడువు. ఈ నెల 6వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+