Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi Yatra: రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర-మణిపూర్ టూ ముంబై- 14 రాష్ట్రాల్లో...

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో భారీ యాత్రకు సిద్ధమయ్యారు. గతంలో భారత్ జోడో యాత్రను విజయవంతంగా చేపట్టి తన ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా పెంచుకున్న రాహుల్ గాంధీ.. ఈసారి ఎన్నికల వేళ భారత్ న్యాయ్ యాత్ర చేపట్టబోతున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి మొదలుపెట్టి పశ్చిమాన ఉన్న వాణిజ్య రాజధాని ముంబై వరకూ ఈ యాత్ర చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దమవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలోని ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 14న మణిపూర్ లో ప్రారంభమయ్యే ఈ భారత్ న్యాయ్ యాత్ర ముంబై వరకు 6,200 కి.మీల మేరకు సాగబోతోంది. ఈ యాత్రలో రాహుల్ 14 రాష్ట్రాల మీదుగా నడవబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 20న ఈ యాత్ర ముగియనుంది.

Rahul Gandhi to take Bharat Nyay Yatra across 14 States from manipur to mumbai from jan 14

ఈ ఏడాది రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో రెండు దక్షిణాది రాష్ట్రాల్లో (కర్నాటక, తెలంగాణ)లో కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించిన నేపథ్యంలో ఆయనపై అంచనాలు గతంలో కంటే పెరిగాయి. దీంతో ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్రలో ఈయన 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను కవర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటిలో మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి.

మరోవైపు గతంలో చేసిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పూర్తిగా నడక సాగించారు. ఈసారి భారత్ న్యాయ్ యాత్రలో సమయాభావం కారణంగా నడకతో పాటు బస్సుల్లోనూ ప్రయాణించబోతున్నారు. ఈ యాత్రలో సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల్ని కలుపుకుని వెళ్లాలనేది తమ ఆలోచన అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుండి రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించి ఐదు నెలల పాటు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రతిపక్ష నేతలతో కలిసి శ్రీనగర్ వరకూ నడిచారు. దీంతో కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఈ యాత్రను ఎక్కువగా ఫోకస్ చేసి విజయాలు అందుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+