మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో భారీ మెజారిటీతో గెలుస్తున్నాం-రాహుల్ గాంధీ ట్వీట్..
ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో ఇవాళ 230 సీట్లకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా... ఛత్తీస్ ఘడ్ లో మాత్రం రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. ఈ రెండు రాష్ట్రాల్నీ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు రాహుల్ ప్రకటించారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పవనాలు బలంగా వీస్తున్నాయని, ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతోంది, ఇళ్ల నుంచి బయటికి రండి, భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి అంటూ ఓటర్లకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

అలాగే పేదలు, రైతులు, మహిళలు, యువత నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కూడా రాహుల్ కోరారు. దీంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో కూడిన ఓ నిమిషం వీడియోను కూడా రాహుల్ గాంధీ షేర్ చేశారు.
मध्य प्रदेश और छत्तीसगढ़ में कांग्रेस का तूफान आ रहा है - भारी बहुमत के साथ!
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2023
घरों से निकल कर, आज करें बड़ी संख्या में मतदान - और, चुनें गरीबों, किसानों, महिलाओं और युवाओं के भरोसे वाली कांग्रेस की सरकार। pic.twitter.com/8cdohuutOl
దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపుపై తాము ఎంత నమ్మకంగా ఉన్నామో రాహుల్ గాంధీ చెప్పినట్లయింది. ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్ సర్వేలు ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ రెండోసారి గెలవడం ఖాయమని, అలాగే మధ్యప్రదేశ్ ను కూడా గెల్చుకుంటుందని తేల్చిచెప్పేశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీలోనూ ఉత్సాహం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications