అనర్హత వేటు ఎఫెక్ట్: ట్విట్టర్ బయోను మార్చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో బయోను అప్ డేట్ చేశారు. తన ఖాతా పేరుకు దిగవన కనిపించే బయో విభాగంలో 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' అని ఉండేది. దాన్ని 'డిస్ క్వాలీఫైడ్ ఎంపీ'తో భర్తీ చేశారు.

'ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా| భారతీయ జాతీయ కాంగ్రెస్ సభ్యుడు|అనర్హత వేటుపడిన ఎంపీ' అని తన బయోను మార్చేశారు.
కాగా, రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ఒక రోజంతా నిరసన చేపట్టింది.

Rahul Gandhi updated his Twitter Bio After Parliament Disqualification

ప్రధాని నరేంద్ర మోడీని నేరస్థుడని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది.

కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దొంగల ఇంటి పేరు మోడీగా ఉంటోందనే ఉద్దేశంలో రాహుల్ వ్యాఖ్యానించారు.

రాహుల్ చేసిన వ్యాఖ్యలు పలు రాష్ట్రాల్లో పలు పరువు నష్టం కేసులకు దారితీశాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని కోర్టు గురువారం రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు అతనికి 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది.

ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ ఇంకా ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదు. గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆ తర్వాత కేరళలోని వాయనాడ్ సీటు ఇప్పుడు ఖాళీగా ఉంది. రాహుల్ 2019లో తన రెండవ సీటు అయిన వయనాడ్ నుంచి ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+