వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు సాయంగా ఉండండి.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ పిలుపు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఫొని తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సముద్ర తీర ప్రాంతంలోని గ్రామ ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయాలని.. కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆ మేరకు ట్విట్టర్ వేదికగా క్యాడర్ కు సూచించారు.

వింత దూడ.. మనిషి స్వభావం.. పాటలకు స్టెప్పులు కూడా..!వింత దూడ.. మనిషి స్వభావం.. పాటలకు స్టెప్పులు కూడా..!

Rahul Gandhi Urges Congress Workers to Warn People in Fani Effected States

ఫొని తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. ఫొని తుపాను ముంచుకొస్తున్నందున.. పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తమ ప్రాంతాల్లో క్రీయాశీలకంగా ముందుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని అప్రమత్తం చేయాలని కోరారు. ప్రజలకు కావాల్సిన సహాయక చర్యల్లో ముందుండాలని సూచించారు. అంతేకాదు ఫొని తుపాను త్వరగా తీరం దాటాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

English summary
Congress president Rahul Gandhi urged party workers in Odisha, Andhra Pradesh and West Bengal to warn people in their neighbourhood about Cyclone Fani and help those in need.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X