వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాప్టర్‌కు రాహుల్ రిపేర్, సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు

|
Google Oneindia TeluguNews

ఉనా : ఎన్నికల్లో భాగంగా ఓటర్లు చేసే పనులు సాధారణం. టీ చేస్తూ, ఇస్త్రీ చేస్తూ ఫొటోలకు ఫోజిస్తుంటారు నేతలు. కానీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజల సమస్యను తన సమస్యగా భావిస్తూ .. ముందుకెళ్తున్నారు. తాజాగా హెలికాప్టర్ రిపేర్ చేస్తూ తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

చేయివేసిన రాహుల్ ..

హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో రాహుల్ నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే రాహుల్ ప్రయాణికస్తున్న హెలికాప్టర్ లో సమస్య తలెత్తింది. దీంతో సిబ్బంది సరిచేస్తుండగా రాహుల్ కూడా రంగంలోకి దిగారు. హెలికాప్టర్ కిందకు దూరి మరీ రిపేర్ చేశారు. మంచి టీం వర్క్ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమేనని దానికి ట్యాగ్ లైన్ పెట్టారు. అంతేకాదు ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలుగుతామని పేర్కొన్నారు.

టీం వర్క్ ..

టీం వర్క్ ..

ఉనా పర్యటనలో ఉన్న హెలికాప్టర్ లో సమస్య ఎదురైంది. అందరం కలిసి దానిని సరిచేశామని రాహుల్ పేర్కొన్నారు. ఈ సాంకేతిక సమస్య వల్ల ఎవరికీ ఏం కాలేదు అని రాహుల్ తెలిపారు. రాహుల్ పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ వీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఇప్పటికే 86 వేల మందికి పైగా లైక్ చేశారు. గ్రైట్ సర్ మీరు చాలా గొప్పవారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హిమచల్ ప్రదేశ్ లో ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 23 లెక్కించి .. విడుదల చేస్తారు.

ఫేస్ బుక్ లైవ్ ...

ఫేస్ బుక్ లైవ్ ...

రాహుల్ ఫొటో షేర్ చేయగా ... ఉనాలో రాహుల్ హెలికాప్టర్ డోర్ తీస్తుండగా ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. మంచి పని చేస్తున్నారు అని ప్రశంసిస్తున్నారు. గతంలో ఏ నేత కూడా ఇలా సాయం చేయలేదని గుర్తుచేస్తున్నారు.

విజయంపై ఎవరిధీమా వారిది

విజయంపై ఎవరిధీమా వారిది

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు 12వ తేదీ ఆరోవిడత పోలింగ్ జరగనుంది. ఇటు 19వ తేదీన ఏడో విడత ఎన్నికలతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. మే 23 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా విజయంపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎవరి ధీమాను వారే వ్యక్తం చేస్తున్నారు.

English summary
Rahul Gandhi, who has been busy campaigning for the ongoing Lok Sabha elections, posted a picture of himself on Instagram which showed him trying to fix something on his helicopter. His chopper broke down in the Una region of Himachal Pradesh while the Congress President was on his way to rally in Una and Mandi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X