కావేరి రచ్చ: స్టాలిన్ ర్యాలీ, రైళ్లు బంద్

చెన్నై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే చీఫ్ కరుణానిధి కుమారుడు ఎం.కే. స్టాలిన్ కర్ణాటకకు విరుద్దంగా చెన్నైలోని ఇగ్మూర్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ ర్యాలీ నిర్వహించారు. కర్ణాటకకు వ్యతిరేకంగా డీఎంకే నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో రైల్ రోకో నిర్వహించారు. డీఎంకే చేపట్టిన రైల్ రోకో కారణంగా పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందికి గురైనారు.

తమిళనాడులో బంద్ శాంతియుతంగా జరుగుతున్నది. చెన్నైలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు తెరుచుకున్నాయి. విద్యార్థులు క్షేమంగా విద్యాసంస్థలకు వెళ్లారు. అయితే తమిళనాడులో ప్రయివేట్ స్కూల్స్ కు సెలవు ప్రకటించారు.

Rail roko was staged by DMK in many parts of Tamil Nadu

కావేరి జలాల పంపిణి విషయంలో కర్ణాటక చేస్తున్న ఆందోళనలను ఖండిస్తూ శుక్రవారం తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు. తమిళనాడులోని పలు పార్టీలతో పాటు తమిళ సంఘాలు బంద్ కు మద్దతు తెలిపాయి.

బంద్ సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చెన్నై నగరంతో పాటు తమిళనాడులో 1.8 లక్షల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+