పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు...లోనోవాలాలో రైల్వే టీసీ అరెస్టు
పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేసినందుకు గాను లోనోవాలకు చెందిన రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. అదేసమయంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు అక్కడి స్థానికులు నివాళులు అర్పిస్తుండగా ఈ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు.
ఓ వైపు ఉగ్రదాడులతో దేశమంతా కన్నీరు మున్నీరు అవుతోంది. దేశవ్యాప్తంగా అమరులైన జవాన్లకు నివాళులు అర్పించడం జరుగుతోంది. ఉపేందర్ కుమార్ బహుదూర్ సింగ్ అనే వ్యక్తి రైల్వే టీసీగా పనిచేస్తున్నాడు. లోనోవాలాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ జిందాబాద్ అని గట్టిగా నినాదాలు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

ప్రజలు శివాజీ చౌక్ దగ్గరకు చేరుకుని నివాళులు అర్పిస్తున్న సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బహదూర్ సింగ్‌కు దేహశుద్ధి చేసేందుకు ముందుకు అడుగువేశారు. అంతలోనే పోలీసులు వచ్చి పెద్ద గొడవ కాకముందే సింగ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా బహదూర్ సింగ్‌కు ఫిబ్రవరి 18వరకు కోర్టు రిమాండ్ విధించింది.
-
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications