Ayodhya Trains: అయోధ్యకు మరో గుడ్ న్యూస్-రామమందిరం ప్రారంభ వేళ 15 కొత్త రైళ్లు కూడా..
అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. వచ్చే నెల 22న రామాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకంటే ముందే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమం రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగబోతోంది. ఈ నేపథ్యలో రైల్వే అధికారులు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
అయోధ్యలో గతంలో పాత రైల్వే స్టేషన్ ఉండేది. అరకొర రైళ్లు దీనికి రాకపోకలు సాగిస్తుండేవి. కానీ ఇప్పుడు కొత్త రైల్వేస్టేషన్ ప్రారంభం కాగానే భారీ ఎత్తున ప్రయాణికుల రాకపోకలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి తగ్గట్టుగా రైల్వే స్టేషన్ నిర్మించిన అధికారులు.. ఇప్పుడు వారి కోసం కొత్త రైళ్లను కూడా ప్రారంభించబోతున్నారు. అయోధ్య స్టేషన్ నుంచి అలాగే అయోధ్య స్టేషన్ కు రాకపోకలు సాగించేలా కొత్తగా 15 రైళ్లు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అయితే అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు ఈ కొత్త రైళ్ల ప్రారంభం లేదని తెలుస్తోంది. రామమందిరం ప్రారంభోత్సవం పూర్తయ్యాక ఈ కొత్త రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో భక్తుల రాకపోకల్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త రైళ్లు ప్రతిరోజూ నడుస్తాయని, అయోధ్య ధామ్ వరకూ వీటిని నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇతర గమ్యస్థానాలకు రైళ్లు అయోధ్య కాంట్ స్టేషన్ నుండి ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.












Click it and Unblock the Notifications