ఇక నుంచి రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రూ.10: 120రోజుల ముందే రిజర్వేషన్
న్యూఢిల్లీ: నూతన ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే ఫ్లాట్‌ఫాం టికెట్ రేటు రెట్టింపు కాబోతోంది. ప్రస్తుతం ఐదు రూపాయలున్న టికెట్‌కు పది రూపాయలు చెల్లించాల్సిందే. ఫ్లాట్‌ఫాం టికెట్ రేటును పెంచాలన్న ప్రతిపాదన కొత్త రైల్వే బడ్జెట్‌లో చేశారు.
దీంతోపాటు 120 రోజుల ముందే రైలు టికెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశమూ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం అరవై రోజులకు ముందే టికెట్లు రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్‌లో ఈ వ్యవధిని 120 రోజులకు పెంచారు.

ఫ్లాట్‌ఫాం టికెట్ ఆదాయంతోపాటు రైళ్ల ద్వారా జరిగే సరుకుల రవాణాకు రేట్లూ పదిశాతానికి పెరిగాయి. ఇవికూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
ఈ పెంపుదల వల్ల రైల్వేల సరుకుల రవాణా ఆదాయం కొత్త ఏడాదిలో 1,21,423 కోట్ల రూపాయల మేర ఉండొచ్చని అంచనా. ప్రస్తుత ఏడాదిలో ఇది 1,06,927 కోట్ల రూపాయల మేర ఉంది.












Click it and Unblock the Notifications