ప్రయాణికులకు గొప్ప ఉపశమనం కలిగించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది. రైళ్లలో ప్రయాణించే వారికి ఐడెంటీటి ప్రూఫ్స్ సమర్పించే విషయంలో గొప్ప ఉపశమనం లభించింది. ఎందుకంటే.. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ వెర్షన్లను కూడా ఐడీ ప్రూఫ్స్‌గా అంగీకరిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్ అందించే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీలను అంగీకరిస్తుందని గురువారం పేర్కొంది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ స్టోరేజ్ సర్వీసులను అందిస్తోంది.

ఈ విషయంపై అన్ని జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను చెల్లుబాటయ్యేవిగా భావిస్తామని తెలిపింది. ప్రధాని మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను, ఆధార్‌ను డిజిటల్‌గా అందిస్తోంది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications