రైళ్ళపై సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? అయితే ఈ షాక్ మీకే!
దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భారీ రద్దీ నెలకొంది. దీపావళి మరియు ఛత్ పండుగల సందర్భంగా ప్రయాణికులు రైళ్ళ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఏ రైల్వేస్టేషన్ చూసిన జనాలు కిటకిటలాడుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పండుగ రద్దీపై రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
రైల్వే అధికారులతో కలిసి మంత్రి నిన్న రాత్రి ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన అశ్విని వైష్ణవ్ రైల్వే స్టేషన్ లో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణికుల భద్రత ఏ విధంగా ఉంది? వారికి అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయా లేదా? అనేది ఆయనే స్వయంగా ఆకస్మిక తనిఖీ ద్వారా తెలుసుకున్నారు.

ప్రయాణీకుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్న మంత్రి
రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులతో నేరుగా సంభాషించిన మంత్రి అశ్విని వైష్ణవ్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న శుభ్రత, అందిస్తున్న సౌకర్యాలకు సంబంధించి ప్రయాణికుల నుండి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారీ రద్దీ ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదే సమయంలో మరొక షాకింగ్ ప్రకటన కూడా చేశారు.
రైల్వే పైన ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తే కఠిన చర్యలు
రైల్వే పైన నకిలీ వీడియోలను ప్రసారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో రైల్వే పైన ఫేక్ వీడియోలు పెడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే చర్యలు ప్రారంభించబడ్డాయి అని ఆయన తెలిపారు. దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ నియంత్రణకు సికింద్రాబాద్ సహా దేశంలోనిఅన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అవసరమైన ఏర్పాట్లు చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
ఫేక్ వీడియో లతో ప్రయాణికులలో గందరగోళం
రైల్వే కార్యకలాపాలకు సంబంధించి తప్పుదారి పట్టించే వీడియోలను ప్రసారం చేయడం వల్ల, ప్రయాణీకుల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని, అందువల్ల వాటిని షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమంలో రైల్వేల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అవాస్తవమైన వాటిని ఎవరు పోస్ట్ చేసినా చర్యలు తప్పవు
ఇప్పటికే చాలామంది రైల్వేకు సంబంధించి అనేక ఫేక్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కేంద్ర మంత్రి, ఇకపై రైల్వేకు సంబంధించి అవాస్తవమైన వాటిని ఎవరు పోస్ట్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications