రైళ్లను నిలిపివేసే ఆలోచనేదీ లేదు, అవసరమైతే పెంచుతాం: కరోనా ఎఫెక్ట్‌పై భారత రైల్వే క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారేమోననే భయంతో వివిధ రాష్ట్రాల్లోని వలస కూలీలు తమ స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. దీంతో చాలా రాష్ట్రాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ పరిణామాలపై స్పందించారు రైల్వే బోర్డ్ ఛైర్మన్ సునీత్ శర్మ.
రైలు సేవలను నిలిపివేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని రైళ్లను పెంచుతామని సునీత్ శర్మ హామీ ఇచ్చారు. రైలు సేవలను తగ్గించడం లేదా నిలిపివేసే ప్రణాళికేదీ లేదన్నారు. అవసరమైనన్నీ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తామన్నారు. వేసవి సీజన్లో రైళ్లలో రద్దీ సహజమేనని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రైళ్ల కొరత లేదని, ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రైళ్ల సేవలను కూడా పెంచుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ సునీత్ శర్మ చెప్పారు. రైళ్లలో ప్రయాణించేవారికి కరోనా నెగిటివ్ పత్రం తప్పనిసరి అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. రైల్వేలో అలాంటి పత్రాలేవీ అడగట్లేదని, అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
Recommended Video
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులు తమ స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. కర్ఫ్యూ, స్వల్ప లాక్ డౌన్లు విధిస్తుండటంతో పూర్తి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందనే ఆందోళనలతో కార్మికులు తిరిగి సొంత స్థలాలకు చేరుకుంటున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి భారీ సంఖ్యలు కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గత మూడు రోజుల్లోనే 4.55 లక్షల మందికిపైగా సొంత రాష్ట్రాలకు పయనమవడం గమనార్హం. ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి.












Click it and Unblock the Notifications