వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకనుంచి రైళ్లలో వేడి వేడి ఆహారం

రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇక నుంచి తమ ప్రయాణికులకు వేడివేడి ఆహారాన్ని అందించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇక నుంచి తమ ప్రయాణికులకు వేడివేడి ఆహారాన్ని అందించేందుకు రైల్వే సిద్ధమవుతోంది. బేస్ కిచెన్ల ద్వారా ప్రతి రెండు గంటలకు ఒకసారి వండిన ఆహారాన్ని ప్రయాణికులకు అందించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజూ 11 లక్షల మంది ప్రయాణికులకు రైల్వేలు ఆహారం అందిస్తున్నాయి. అయితే రైళ్లలో అందిస్తున్న ఆహారంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ఆహారం తయారీ, పంపిణీని కలిపే చేస్తుండగా తాజా కేటరింగ్ విధానం ప్రకారం ఈ రెండింటినీ విడగొట్టారు. కేటరింగ్‌పై చర్చించేందుకు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ''రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన తాజా ఆహారాన్ని అందించాలని నిర్ణయించాం. పలు ప్రాంతాల్లో బేస్ కిచెన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి రెండు గంటలకు ఓసారి తాజా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం విమానయానంలో కూడా ఇటువంటి సదుపాయం లేదు..'' అని పేర్కొన్నారు.

English summary
NEW DELHI: Plagued with complaints, Railways plan to provide fresh food cooked at base kitchens in trains after every two hours to the passengers. Railways, which provides about 11 lakh meals to passengers every day, has separated cooking and distribution of food under the recently launched new catering policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X