రైల్వే గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి 200 నాన్-ఏసీ రైళ్లు..

లాక్ డౌన్ 4.0లో రైళ్లు,విమానాలు మినహాయించి దాదాపుగా అన్ని రంగాలకు కేంద్రం సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే రైలు సర్వీసులను కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. జూన్ 1వ తేదీ నుంచి ప్రతీరోజూ 200 నాన్-ఏసీ రైళ్లను నడపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీటికి సంబంధించిన బుకింగ్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Recommended Video

    Railways To Start 200 Non-AC Special Passenger Trains From June 1st

    రిజర్వేషన్ చేయించుకున్న వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని.. కౌంటర్ల వద్ద టికెట్ల జారీ,బుకింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందనేది స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు వలస కూలీల కోసం ప్రస్తుతం నడుపుతున్న 200 శ్రామిక్ రైళ్లను 2 రోజుల్లోగా రెట్టింపు చేస్తామని వెల్లడించారు. ప్రతీ రోజూ 400 శ్రామిక్ రైళ్లను నడుపుతామన్నారు. కాబట్టి వలస కూలీలు ఎక్కడివారే అక్కడే ఉండాలని.. రాబోయే కొద్దిరోజుల్లో రైల్వే వారందరినీ వారి గమ్య స్థానాలకు చేరుస్తుందని చెప్పారు.

    Railways To Run 200 Non-AC passenger Trains Daily From June 1

    కాగా, మే 22వ తేదీ నుంచి వెయిటింగ్ లిస్ట్‌ను ప్రారంభిస్తున్నట్టు రైల్వేశాఖ గత వారమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నడుపుతున్న 15 స్పెషల్ ట్రైన్స్‌తో పాటు మరిన్ని రైళ్లను నడుపుతామని చెప్పింది. దానికి తగ్గట్టే తాజాగా రైళ్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే నిర్ణయంపై రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+