ధ్వంసం: గంగోత్రి, భద్రీనాథ్, కేథార్ నాథ్ యాత్రలకు బ్రేక్
డెహ్రాడూన్: భారీవర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దాదాపు 136 రోడ్లు పూర్తిగా పాడైపోయి బ్లాక్ అయ్యాయి.
రోడ్లు ధ్వంసం కావడతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ముఖ్యంగా యాత్రా మార్గాలు మూసుకుపోయిన పరిస్థితి తలెత్తింది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో ఉత్తర కాశీలో 34 రోడ్లు, పౌడీలో 21, తెహ్రీలో 23, చమోలీలో 15, డెహ్రాడూన్ లో 17, బాగే షేర్ లో 8, చంపావత్, ఆల్మోరా, నైనిటాన్, హరిద్వార్ లో 18 రహదారులు ధ్వంసం అయ్యాయి.
కాశీ, అలకనంద, భగీరథీ, మందాకిని, గంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంగోత్రి, భద్రీనాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, చార్ ధామ్ యాత్రల మార్గాలు అన్ని మూసుకుపోయాయి. అధికారులు రోడ్లు మరమత్తులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications