చెన్నైలో మళ్లీ వర్షాలు, ప్రజలు, నెల చివరి వరకూ, బంగాళాఖాతంలో, అందుకే, అలర్ట్ !
చెన్నైలో మళ్లీ మొదలైన వర్షాలు, నెల చివరి వరకూ !బంగాళాఖాతంలో అల్పపీడన ఆవర్తనం ఏర్పడే అవకాశంతమిళనాడు, శ్రీలంకను అనుకుని ఉన్న ప్రాంతంలో, 60 కి.మీ వేగంతో గాలులు
చెన్నై: చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి వర్షాలు పడటంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో మరికొద్ది రోజులు వర్షం కురుస్తోందని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. చెన్నై నగరంతో సహ కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే వెంటనే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
అండమాన్ సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం హిందూ మహాసముద్రం వరకు ఉపరితల ద్రోణిగా వ్యాపించిందని వాతావరణ శాఖ చెప్పింది. దక్షిణ తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో ఈ నెల చివరి వరకూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడుతోందని వాతావరణ శాఖ చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంకను ఆనుకుని ఉన్న ప్రాంతంలో నవంబర్ 29వ తేదీన కొత్త అల్పపీడన ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అల్పపీడన పరివర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షం పడే అవకాశం చాల ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వివరించింది. సముద్రంలో ప్రస్తతం గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో సెలవుల మీద వెళ్లిన రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications