అన్ని రాజ్ భవన్‌‌ల పేర్ల మార్పు: రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇక..: కేంద్రానికి కీలక సూచనలు

న్యూఢిల్లీ: ఇదివరకు ఉత్తర ప్రదేశ్‌లో పలు నగరాల పేర్లు పూర్తిగా మారిపోయాయి. మొఘల్ సరాయ్‌ రైల్వే స్టేషన్‌ పేరును పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయగా మార్చిందక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అలహాబాద్‌కు ప్రయాగ్‌రాజ్‌గా నామకరణం చేసింది. రాజధాని లక్నో పేరును లక్షణపురిగా మార్చడానికి యోగి సర్కార్ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం విస్తృతంగా సాగింది. అదే ఆనవాయితీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగిస్తోన్నారు. దేశ రాజధానిలో కొన్ని ప్రాంతాల పేర్లల్లో మార్పులు చేశారు.

కింగ్స్‌వే, రాజ్‌పథ్ పేరును తొలగించి- కొత్తగా కర్తవ్యపథ్‌గా పేరు పెట్టారాయన. బ్రిటీష్ హయాంలో కింగ్స్‌వేగా ఉన్న పేరు ఆ తరువాత రాజ్‌పథ్‌గా మారింది. ఇప్పుడు మోదీ దాన్ని తొలగించారు. కర్తవ్యపథ్‌గా కొత్త పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని- వలసవాద పాలనలో ఏర్పాటైన పేర్లు, చిహ్నాలను తొలగిస్తామంటూ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తోన్నారు.

Raj Bhavans why not rename as Kartavya Bhavans, Shashi Tharoor slams centre

రాజ్‌పథ్ పేరు తొలగించి కర్తవ్యపథ్‌గా మార్చడాన్ని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు శశి థరూర్ తప్పుపట్టారు. రాజ్ అనే పేరులో ఎలాంటి తప్పు ఉందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలపై ఉన్న అక్కసుతోనే దీన్ని తొలగించినట్లు కనిపిస్తోందని అన్నారు. రాజ్ అనే పేరును తొలగించాల్సి వస్తే- దేశంలోని అన్ని రాజ్ భవన్‌ల పేర్లను కూడా మార్చాల్సి ఉంటుందని చెప్పారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ పేరును కర్తవ్య భవన్‌గా మార్చుతారా? అని ప్రశ్నించారు.

Raj Bhavans why not rename as Kartavya Bhavans, Shashi Tharoor slams centre

రాజస్థాన్ పేరును కూడా తొలగించి దాన్ని కర్తవ్యస్థాన్‌గా మార్చాలని శశి థరూర్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా లేవనెత్తారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కర్తవ్యధాని ఎక్స్‌ప్రెస్‌గా మార్చక తప్పదంటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు సంధించారు. అలాగే- రాజ్ భోగ్ స్వీట్ పేరును కర్తవ్య భోగ్‌గా మార్చే ఆలోచన ఉందా? అని మహువా మొయిత్రా కేంద్రాన్ని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+