బెంగళూరు ఆర్ఆర్ నగర ఎన్నిక వాయిదా, అమిత్ షా కక్షకట్టారు రూ. 95 లక్షలు, నాయుడు ఫైర్!
Recommended Video

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరినగర (ఆర్ఆర్ నగర) శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసిందని, తన మీద కుట్ర జరుగుతోందని ఆ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న నాయుడు ఆరోపించారు. అమిత్ షా తన మీద కక్షకట్టారని, రూ. 95 లక్షల టీషర్టులకు తనకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఆరోపించారు. ఆర్ఆర్ నగర ఎన్నికల వాయిదా పడిన నేపథ్యంలో మునిత్న నాయుడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద ఆరోపణలు చేశారు.

నేనే తప్పుకుంటాను
ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని ఎన్నికల సంఘం నేరుగా తనకే చెప్పి ఉంటే తాను తప్పుకునేవాడినని, నేనుచేయని తప్పుకు ఇలా ఎన్నికలు వాయిదా వేసి తనను మానసికంగా హింసించారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ కార్పొరేటర్
జాలహళ్ళిలోని అపార్ట్ మెంట్ లో చిక్కిన ఓటరు ఐడీ కార్డులు నకిలీవికాదని స్వయంగా ఎన్నికల సంఘం చెప్పిందని మునిరత్న నాయుడు అన్నారు. ఓటరు ఐడీ కార్డులు చిక్కన అపార్ట్ మెంట్ ఉన్న ప్రాంతం కార్పొరేటర్ బీజేపీ మనిషి, అపార్ట్ మెంట్ యజమాని బీజేపీ మనిషి, కేవలం అక్కడ తన కరపత్రం చిక్కిందని ఎన్నికలు వాయిదా వేయడం విడ్డూరంగా ఉందని మునిరత్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమిత్ షా కుట్ర
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన మీద వ్యక్తిగతంగా కక్షకట్టారని, రెండుసార్లు తన నియోజక వర్గానికి ఆయన వచ్చారని, తాను విజయం సాధిస్తానని పసిగట్టిన ఆయన ఎన్నికలు వాయిదా వేయించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.

కంటేనర్ రిలయన్స్ ది
కంటేనర్ లో తన ఫోటోలతో ఉన్న 5,000 టీషర్లులు ఎన్నికల సంఘం అధికారులకు చిక్కాయని, ఆ కంటేనర్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని మునిరత్న నాయుడు అన్నారు. కంటేనర్ రిలయన్స్ గూడ్స్ కు చెందినదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు చెప్పారు.

రూ.95 లక్షలు
కంటేనర్ లో ఉన్న టీ షర్టుల విలువ రూ. 95 లక్షలు అని ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. అయితే కంటేనర్ లో టీషర్టులకు చెందిన రూ. 95 లక్షల రసీదు ఉందని, చివరికి తన మీద నేరం వేసి ఎన్నికలు వాయిదా వేయడం ఎంతవరకూ న్యాయమని మునిరత్న నాయుడు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. మే 12 జరగవలసిన ఎన్నికలు రాజరాజేశ్వరినగరలో మే 28వ తేదీ జరగనున్నాయి. మే 31వ తేదీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications