Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Secretes: గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఉగ్రవాదులకు ఆర్మీ సమాచారం షేర్ చేసిన వ్యాపారి, ఫేస్ బుక్ దెబ్బ !

బెంగళూరు: బుద్దిగా బెంగళూరులో బట్టల వ్యాపారం చేసుకున్న వ్యక్తికి ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయం అయ్యింది. అందమైన యువతి ఫోటో చూసి సోల్లు కార్చుకున్న ఆ వ్యాపారి ఆమె మైకంలో పడిపోయాడు, ఆరు నెలల నుంచి ఫేస్ బుక్ లో ఆమెతో చాటింగ్ చేస్తున్న వ్యాపారి ఆమె చెప్పినట్లు ఆడాడు. భారత మిలటరీ దుస్తులు వేసుకుని రాజస్థాన్ లోని పాకిస్థాన్ బార్దర్ కు వెళ్లాడు. అక్కడ భారత మిలటరీ అధికారులు తిరుగుతున్న వాహనాలను, సరిహద్దులను ఫోటోలు తీశాడు. తరువాత ఫేస్ బుక్ ప్రియురాలికి ఇతను ఫోటోలు పంపించాడు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సంస్థకు భారత్ నుంచి ఫోటోలు పంపిస్తున్నారని భారత్ ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. బెంగళూరులో ఉన్న బట్టల వ్యాపారి ఐఎస్ఐ సంస్థకు ఫోటోలు, సమాచారం పంపిస్తున్నాడని తెలుసుకున్న మిలటరి అధికారులు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైమ్ బ్రాంచ్, మిలటరి అధికారులు కలిసి బెంగళూరులో బట్టల వ్యాపారిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. తాను ఇంతకాలం ఫోటోలు, సరిహద్దు సమాచారం పంపించింది అమ్మాయికి కాదని, ఉగ్రవాదులకు అని ఆలస్యంగా తెలుసుకున్న బట్టల వ్యాపారి కటకటాలపాలైనాడు.

 బెంగళూరులో వ్యాపారం

బెంగళూరులో వ్యాపారం


రాజస్థాన్ కు చెందిన జితేందర్ సింగ్ అనే వ్యక్తి బెంగళూరు చేరుకుని కాటన్ పేట్ లో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. హోటల్ సేల్ బట్టల వ్యాపారం చేస్తున్న జితేందర్ సింగ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్నాడు. ఫేస్ బుక్ లో అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న జితేందర్ సింగ్ వారిని చూసి సోల్లు కార్చుకుంటున్నాడు.

ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్

ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్

బుద్దిగా బెంగళూరులో బట్టల వ్యాపారం చేసుకున్న జితేందర్ సింగ్ కు ఆరు నెలల ముందు ఫేస్ బుక్ లో నేహా పూజాజీ అనే పేరుతో ఓ యువతి పరిచయం అయ్యింది. అందమైన యువతి ఫోటో చూసి సోల్లు కార్చుకున్న వ్యాపారి జితేందర్ ఆమె మైకంలో పడిపోయాడు, ఆరు నెలల నుంచి ఫేస్ బుక్ లో ఆమెతో చాటింగ్ చేస్తున్న జితేందర్ ఆమె చెప్పినట్లు ఆడాడు.

అమ్మాయి కాదు..... పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్

అమ్మాయి కాదు..... పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్


పాకిస్థాన్ కు చెందిన గుడాచారి సంస్థ ఐఎస్ఐకి చెందినస ఓ అధికారి నేహా పేరుతో బెంగళూరులో ఉంటున్న బట్టల వ్యాపారి జితేందర్ తో పరిచయం చేసుకున్నాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని, తాను ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నానని, త్వరలో భారత్ వచ్చి నిన్ను కలుస్తానని జితేందర్ కు మెసేజ్ చేసింది.

 మిలటరి వాహనాలు.... సరిహద్దు సమాచారం లీక్

మిలటరి వాహనాలు.... సరిహద్దు సమాచారం లీక్

తనకు భారత్ మిలటరీ అధికారులు అంటే చాలా గౌరవం, వారు సరిహద్దుల్లో ఎలా భద్రతా ఏర్పాట్లు చేస్తారు, ఎలాంటి వాహనాల్లో తిరుగుతారు అని చూడాలని ఉందని, నువ్వు ఫోటోలు తీసి అక్కడి సమాచారం తనకు ఇవ్వాలని ఐఎస్ఐ ఏజెంట్లు వ్యాపారి జితేందర్ సింగ్ కు మాయమాటలు చెబుతూ సమాచారం ఇచ్చారు.

మిలటరీ దుస్తులు వేసుకుని ఫోటోలు తీసి ?

మిలటరీ దుస్తులు వేసుకుని ఫోటోలు తీసి ?

భారత మిలటరీ దుస్తులు వేసుకున్న జితేందర్ రాజస్థాన్ లోని పాకిస్థాన్ బార్దర్ కు వెళ్లాడు. తరువాత జితేందర్ అక్కడ భారత మిలటరీ అధికారులు తిరుగుతున్న వాహనాలను, సరిహద్దులను ఫోటోలు తీశాడు. తరువాత జితేందర్ ఫేస్ బుక్ ప్రియురాలి ముసుగులో ఉన్న పాక్ ఐఎస్ ఐ ఏజెంట్లకు ఆ ఫోటోలు పంపించాడు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సంస్థకు భారత్ నుంచి ఫోటోలు పంపిస్తున్నారని భారత్ ఆర్మీ అధికారులకు సమాచారం అందింది.

Recommended Video

    Loksabha Elections 2019 | రాజకీయాల నుండి తప్పుకుంటున్న ఎల్ కే అద్వానీ | Oneindia Telugu
    బెంగళూరులో అరెస్టు

    బెంగళూరులో అరెస్టు

    బెంగళూరులో ఉన్న బట్టల వ్యాపారి జితేందర్ సింగ్ పాకిస్థాన్ ఐఎస్ఐ సంస్థకు ఫోటోలు, సమాచారం పంపిస్తున్నాడని తెలుసుకున్న మిలటరి అధికారులు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్, మిలటరి అధికారులు కలిసి బెంగళూరులోని కాటన్ పేట్ సమీపంలో బట్టల వ్యాపారి జితేందర్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. తాను ఇంతకాలం ఫోటోలు, సరిహద్దు సమాచారం పంపించింది అమ్మాయికి కాదని, పాకిస్తాన్ ఉగ్రవాదులకు అని ఆలస్యంగా తెలుసుకున్న బట్టల వ్యాపారి జితేందర్ కటకటాలపాలైనాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+