పెళ్లి వేడుకలో విషాదం: నదిలో పడ్డ బస్సు, 24 మంది మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడంతో 24 మంది దుర్మరణం పాలయ్యారు. బూండీలోని కోట లాల్ సాత్ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులు, స్నేహితులు కోట నుంచి సవాయ్ మాదోపూర్ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులు సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం.

Recommended Video

APSRTC Launches Chalo APP | ఇక ఆర్టీసీ ప్రయాణం.. మరింత సుఖం! | Oneindia Telugu
ఇప్పటి వరకు కనీసం 24 మంది మృతి చెందినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రయాణికులను బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications