రాజస్థాన్ యువతిపై లైంగిక దాడి: దారుణ హత్య
బెంగళూరు: బెంగళూరు శివర్లాలో రాజస్థాన్ కు చెందిన యువతిని అతి దారుణంగా హత్య చేశారు. రాజనకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువ జామున యువతిని హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు- దోడ్డబళ్లాపుర రోడ్డులోని రాజనకుంటే పెట్రోల్ బంక్ వెనుక వైపు నీలగిరి తోట ఉంది. శనివారం వేకువ జామున కారులో కొందరు అటు వైపు వెళ్లారు. తరువాత నీలగిరి తోటలోని నిర్జనప్రదేశంలోకి వెళ్లిన నిందితులు 26 సంవత్సరాల యువతిని కారులో నుండి బయటకు తీసుకు వెళ్లారు.
తరువాత యువతి తల మీద బండరాళ్లు వేసి అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన నిందితులు అక్కడి నుండి పరారైనారు. శనివారం ఉదయం స్థానికులు నీలగిరి తోటలోకి వెళ్లిన సమయంలో హత్య జరిగిన విషయం వెలుగు చూసింది.

విషయం తెలుసుకున్న రాజనకుంటే పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ఎం.ఎన్.ఆర్. రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి మీద లైంగిక దాడి చేసిన తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వేకువ జామున 3.30 గంటల నుండి 4 గంటల మధ్య హత్య జరిగిందని పోలీసులు అన్నారు.
ప్రేమ విషయం, అక్రమ సంబంధం కారణంగా యువతిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. కారు వచ్చి వెళ్లిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. యువతిని హత్య చెయ్యాలని ముందుగానే ప్లాన్ వేసుకుని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications