ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా ? సంచలన నిర్ణయం!
జైపూర్: రాజస్థాన్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వీదేశీ సంసృతిని విద్యార్థులకు దూరం చెయ్యాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ప్రేమికుల రోజు విద్యార్థులు వారి తల్లిదండ్రులను గౌరవించేలా చెయ్యాలని నిర్ణయించింది.

ప్రేమికుల రోజు బ్యాన్
ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు అని అందరీకి తెలిసిందే. చిన్నపెద్ద అన్నా తేడాలేకుండా ప్రేమికులు, ప్రేమ వివాహాలు చేసుకున్న దంపతులు ఫిబ్రవరి 14వ తేదీ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒకరికి ఒకరు వారి స్థాయికి తగ్గట్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 14వ తేది రాజస్థాన్ లోని అన్ని ప్రభుత్వం విద్యాసంస్థల్లో ఇక ముందు మాతా-పిత (తల్లి, తండ్రి) పూజా మహాన్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థుల దగ్గర వారి తల్లిదండ్రుల పాదాలకు ప్రత్యేక పూజలు చేయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం ఆదేశాలు
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఇక ముందు రాజస్థాన్ లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర వారి తల్లిదండ్రులకు ప్రత్యేక పాదపూజ చేయిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవనాని ఆదేశాలు జారీ చేశారు.

కన్నడిగుల ఆలోచన
ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు విద్యార్థుల దగ్గర వారికి తల్లిదండ్రులకు పాదపూజ చేయించాలని మంగళూరుకు చెందిన ఓ హిందూ సంఘ సంస్థ గత నెల13వ తేదీ మంగళూరు కలెక్టర్, జిల్లాధికారులకు వినతిపత్రం సమర్పించారు.

రాజస్థాన్ లో అమలు
దక్షిణ కన్నడ జిల్లాలో పుట్టిన ఆలోచన ఇప్పుడు కర్ణాటకలో అమలుకాలేదు కాని రాజస్థాన్ లో అమలులోకి వస్తోంది. మొత్తం మీద విదేశీ సంసృతిని విద్యార్థులకు దూరం చెయ్యాడానికి రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications